ఇలియానా రావడం పక్కా..?

టాలీవుడ్లో సినిమా చేసి ఇలియానా కి చాలా కాలమైంది. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్స్ కోసం తెగ వెయిట్ చేస్తున్న ఇలియానా తాజాగా ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే అమ్మడునుండి ఎటువంటి సమాచారం లేదు. కారణం ఇలియానా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకుంటూ బీచ్ ఒడ్డున సేద దీరుతుంది. తన బాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాన్ ఫోటో గ్రాఫేర్ ఆండ్రు తో చెట్టాపట్టాలేసుకుని.. హాట్ హాట్ ఫొటోస్ తీసియించుకుంటున్న ఇలియానా సినిమా అవకాశాల కోసం ఒక రాయి వేస్తూనే వుంది. కాకపోతే ఇలియానా పేస్ లో ఉండాల్సిన గ్లో మాత్రం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎంత నాజూగ్గా ఉన్నప్పటికీ.. మోహంలో ఉండాల్సిన అందం లేకపోతె కష్టమే.

అయితే చాలా గ్యాప్ తర్వాత ఇలియానా కి తెలుగులో ఒక అవకాశం వచ్చింది. రవితేజ – శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలియానా హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందనే ప్రచారం జరిగింది. కానీ యూనిట్ నుండి గాని, ఇలియానా నుండి గాని ఇలియానా ఆ సినిమాలో నటిస్తున్నట్లుగా సమాచారం లేదు. కాగా తాజాగా ఇలియానా రవితేజ సినిమాలో ఫిక్స్ అయ్యిందని. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కన్ఫర్మ్ చేసాడు. థమన్ తన ట్విట్టర్ లో ఈ సినిమాలోకి వెల్కమ్ అంటూ ఇలియానాకు స్వాగతం చెప్పాడు. అలాగే రవితేజ – శ్రీను వైట్ల కాంబోలో వచ్చే సినిమా కి అమర్ అక్బర్ ఆంటోని టైల్ కూడా దాదాపుగా తన ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేసాడు. ఇలియానా కి వెల్ కం చెప్పిన థమన్ ఎఎఎ అనే హ్యాష్ ట్యాగ్ కూడా తగిలించడంతో… ఈ సినిమాకి అమర్ అక్బర్ ఆంటోని అనే టైటిల్ కన్ఫర్మ్ ఆంటున్నారు.

మరి ఈ సినిమా లో ముగ్గురు హీరోయిన్ ఉండగా.. అందులో ఒక హీరోయిన్ గా ఇలియానా ని ఫైనల్ చేసిన చిత్ర బృందం మరో ఇద్దరినీ సెట్ చేసే పనిలో ఉందట. మరో హీరోయిన్ గా అను ఇమ్మాన్యువల్ ని తీసుకుంటే.. ఆమె తనకి డేట్స్ లేవనే ఒంకతో ఈ సినిమా నుండి తప్పుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని శ్రీను వైట్ల అమెరికా పరిసరప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాడు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*