పాపం క్లారిటీ ఇచ్చుకుంది

గత కొన్ని రోజులుగా ఇలియానా పర్సనల్ లైఫ్ విషయంలో సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇలియానా కి తన ఆస్ట్రేలియాన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రు తో పెళ్లి జరిగిందని… పెళ్లిని సీక్రెట్ గా దాచేసిందనే న్యూస్ గత మూడు నెలలుగా హల్చల్ చేస్తుంది. అయితే ఇలియానా కూడా తన పెళ్లి జరిగిందని క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూషన్ లో పెడుతూ వస్తుంది. తనకి ఆరోగ్యం బాగలేనపుడు తన హబ్బీ తనని కంటికి రెప్పలా చూసుకున్నాడని.. ఆండ్రు దొరకడం తనకి అదృష్టమని ఏవేవో చెప్పింది. ఇక ఇలానే క్లారిటీ ఇచ్చి ఇవ్వనట్టు ఇవ్వడంతో అందరూ ఇలియానా కి పెళ్లయిందని ఫిక్స్ అయ్యారు.

ఇక తాజాగా ఇలియానా ప్రెగ్నెంట్ అని కూడా కొన్ని వార్తలు వినబడాయి. అందుకు కారణం ఈమధ్యన ఇలియానా నటించిన రెయిడ్ చిత్ర ప్రమోషన్స్ లో లూజుగా ఉన్న దుస్తులు ధరించి రావడంతో ఇల్లి బేబీ ప్రెగ్నెంట్ అంటూ బి టౌన్ వర్గాల భోగట్టా అనే న్యూస్ దావానలంలా వ్యాపించింది. ఆ బి టౌన్ ఏమో గాని సోషల్ మీడియాలో మాత్రం టాప్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని.. వాట్ ఇల్లి బేబీ ప్రెగ్నెంటా… అంటూ హాట్ హాట్ న్యూస్ లు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ వార్తలపై ఇల్లి బేబీ స్పందించింది. తన ప్రెగ్నెంట్ గురించి గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

నేను గర్భవతిని కాను…. అంటూ కొన్ని ఫొటోస్ ని ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలను ఆస్ట్రేలియాన్ ఫోటో గ్రాఫేర్ అయినా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌ తీసాడని తెలిపింది. అయితే ఆ ఫొటోస్ లో నిజంగానే ఇలియానా చెప్పినట్లుగా ఆమె తల్లికావడంలేదు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి టైట్ దుస్తుల్లో ఇలియానా షేప్ చూస్తుంటే ఇల్లి బేబీ నిజమే చెప్పిందనిపిస్తుంది.మరి ఇక్కడితో అయినా ఇలియానా ప్రెగ్నెంట్ వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*