క్రేజ్ లేకపోయినా.. రెండు కోట్లా?

సన్నజాజి లాంటి నడుమందాలతో ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపింది. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించిన ఇలియానా కి బాలీవుడ్ మీద మోజు పుట్టి టాలీవుడ్ ని కాలదన్నింది. బాలీవుడ్ కి వెళ్లినా అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో నటించిన ఇలియానా గత కొంతకాలంగా తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. అయితే తాజాగా ఇలియానా శ్రీను వైట్ల – రవితేజ ‘అమర్ – అక్బర్ – ఆంటోని’ సినిమాలో నటిస్తుందని న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సరే అన్న ఇలియానా…

అయితే శ్రీను వైట్ల అండ్ కో ఇలియానా ని సంప్రదించడం నిజమే అని ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా ఇలియానా ని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలోకి హీరోయిన్ గా ఇలియానాని సంప్రదించగా ఒప్పుకోవడానికి ముందుగా రెండు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇలియానా కోసం నిర్మాతలు రెండు కోట్లు పారితోషకం ఇవ్వడానికి అంగీకరించినట్లుగా తెలుస్తుంది.

మరీ రెండు కోట్లా..?

మరి తెలుగులో ఇలియానాని పట్టించుకునే నాధుడే లేనప్పుడు. ఇంత పారితోషకం డిమాండ్ చేయడమే ఆశ్చర్యకరం. అయినా ఇలియానా అంత డిమాండ్ చేసినా దానికి నిర్మాతలు తలూపడమే ఇప్పుడు అర్థం కాని విషయం. ఏదైనా ఇలియానాకి టాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేదు. అలాంటప్పుడు ఆమెకు రెండు కోట్లు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదనే అభిప్రాయాలూ వినబడుతున్నాయి.