కమల్ కోసం అజయ్ ని దింపుతున్నాడు..!

shanker bharatiyudu 2 budget

దర్శకుడు శంకర్ సినిమాలంటే భారీతనంతో కూడుకున్నవి. ఆయన సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు అంటే.. ఆ సినిమాపై పిచ్చ క్రేజ్ ఉంటుంది. గతంలో కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా రికార్డులు సృష్టించింది. సెన్సేషనల్ హిట్ అయ్యింది. మళ్లీ అలాంటి కాంబో ఇప్పుడు ఇండియన్ 2 సినిమాతో రిపీట్ కాబోతుంది. కమల్ హాసన్ – శంకర్ కాంబోలో ఇండియన్ 2 సినిమా మరో రెండు మూడు నెలల్లోనే పట్టాలెక్కబోతుంది. అసలు ఆ సినిమాని గత ఏడాది ప్రకటించినప్పటి నుండి ఆ సినిమా పై భారీ అంచనాలతో పాటుగా క్రేజ్ కూడా వచ్చేసింది.

విలన్లుగా బాలీవుడ్ హీరోలు

ఇకపోతే ఈ సినిమాపై లేటెస్ట్ గా ఒక న్యూస్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే కమల్ – శంకర్ కాంబోలో వస్తున్న ఈ ఇండియన్ 2 లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నాడని. మరి ఇండియన్ 2 సినిమాలో అజయ్ దేవగన్ కోసం ఒక పాత్రని రాసి పెట్టుకున్నాడట శంకర్. మామూలుగానే శంకర్ కి సినిమాల్లో భారీ తనం చూపించడమే కాదు… ఆ సినిమాల్లో బాలీవుడ్ హీరోలను విలన్స్ గా చేసి చూపించడం అన్నా భలే సరదా. తాజాగా శంకర్ – రజనీకాంత్ కాంబోలో తెరకెక్కిన 2.ఓ సినిమాలో అక్షయ్ కుమార్ ని విలన్ పాత్రకి తీసుకున్నాడు. మరి 2.ఓ లో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో అదరగొట్టాడనే టాక్ అతని లుక్ చూస్తేనే తేలుస్తుంది.

ఆజయ్ ది విలన్ పాత్రేనా..?

మరి తాజాగా ఇండియన్ 2 కోసమే మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ని దింపుతున్నాడు దర్శకుడు శంకర్. అయితే ఇండియన్ 2 లో అజయ్ ది విలన్ పాత్రనా…? లేదంటే ఏదైనా కీ రోలా..? అనేది మాత్రం సస్పెన్సుగానే ఉంది. ప్రస్తుతం శంకర్ 2.ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తీరిక లేకుండా ఉంటే.. కమల్ హాసన్ విశ్వరూపం 2 విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉండడమే కాదు… బిగ్ బాస్ సీజన్ 2 హోస్టింగ్ తోనూ బిజీగా వున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*