2.ఓ పై రెండు ఆసక్తికర వార్తలు

సూపర్ స్టార్ రజినీకాంత్ 2.ఓ సినిమాతో ఈ ఏడాది ఆయన రాక ఖాయమైంది. ఈ ఏడాది విడుదల కాదనుకుంటున్న తరుణంలో 2.ఓ సినిమా నవంబర్ 29 న విడుదల కాబోతుంది అంటూ గత అర్ధరాత్రి దర్శకుడు శంకర్ అలా ట్వీట్ చేసాడో లేదో… ఇలా ఈ సినిమాపై అనేక రకాల న్యూస్ లు హాట్ హాట్ గా ప్రచారం జరుగుతున్నాయి. గత ఏది జూన్ లోనే 2.ఓ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. 2 .ఓ గ్రాఫిక్స్ పనుల వలన సినిమా విడుదల వాయిదా పడుతూ రావడంతో.. ఇప్పుడు విఎఫెక్స్ వారు చేసిన ప్రామిస్ తో దర్శకుడు శంకర్ ప్రేక్షకులకు 2.ఓ సినిమా విడుదల డేట్ ని ప్రకటించేశాడు.

23 ఏళ్ల తర్వాత రెండు సినిమాలు…

అయితే ఎటువంటి సెలవులు లేని నవంబర్ 29 డేట్ ని శంకర్ ఎంచుకోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శంకర్ కి 2 .ఓ మీద ఉన్న అతి నమ్మకం వల్లే ఎటువంటి సెలవలు లేకుండా బరిలోకి దిగుతున్నాడని.. తమిళులకు ఏంతో ఇంపార్టెంట్ అయిన దీపావళికి కాకుండా ఇలా సింగిల్ వీకెండ్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాని విడుదల చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. మరో వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ గత 23 ఏళ్లలో ఒకే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. 23 ఏళ్ల క్రితం రజనీకాంత్ ముత్తు, భాష సినిమాలతో బాక్సాఫీసుని షేక్ చేసాడు. ఇక ఈ ఏడాది కాలా సినిమా తో దెబ్బతిన్న రజనీకాంత్ ఇప్పుడు 2.ఓ సినిమాతో బరిలోకి రాబోతున్నాడు.

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్…

ఇక ముత్తు, భాష సినిమాలను ఒకే ఏడాది విడుదల చేసిన రజనీకాంత్ తర్వాత ఏడాది నుండి ఏడాదికి కేవలం ఒక్క సినిమాతోనే అభిమానులను పలకరిస్తున్నారు. అయితే గత ఎడాది బరిలో ఉండాల్సిన 2.ఓ సినిమా అనుకోకుండా ఈ ఏడాదికి పోస్ట్ పోన్ అవడంతో… ఈ ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి కాలా, 2 .ఓ సినిమాలు వస్తున్నాయి. మరి 2 .ఓ సినిమాని లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాకపోతే అంతకుమించి ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా న్యూస్ ఉంది. ఇలా 2.ఓ సినిమా రిలీజ్ డేట్ బయటికి రాగానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ లు భలే ప్రచారంలోకి వచ్చేసాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*