రంగస్థలంతో బాబుకి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది

సుకుమార్ – రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా హిట్ తో రామ్ చరణ్ కి సమంతకి, జగపతి బాబు కి, అనసూయ కి, ఆది పినిశెట్టికి ఎక్కడలేని పేరు ప్రతిష్టలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించిన జబర్దస్త్ మహేష్ కి కూడా ఒక్కసారిగా పేరు వచ్చేసింది. జబర్దస్త్ తో వెలుగులోకొచ్చిన అనేకమంది కమెడియన్స్ వెండితెర మీద స్ట్రాంగ్ గా పాతుకుపోయారు. ఇప్పుడు మహేష్ కూడా రంగస్థలంలో చిట్టిబాబు కి సహాయకుడిగా అద్భుతమైన నటన కనబర్చి అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు.

చిట్టిబాబుకి వినికిడి లోపం ఉండడంతో మహేష్ చిట్టిబాబుకి అన్ని విషయాలను చాలా వివరంగా చిట్టిబాబు కి వినబడేలా చెప్పడం… అలాగే చిట్టిబాబు నాన్నమ్మ ని ప్రెసిడెంట్ జగపతిబాబు చెంచా తిట్టినా తిట్టు ని చిట్టిబాబు కి ఒక రేంజ్ లో చెప్పడం, అలాగే ఆపై చిట్టిబాబు చనిపోయిన తన అన్నను భుజాన వేసుకుని వచ్చే సన్నివేశంలో మహేష్ నటన తో పాటు చిట్టిబాబుని ఉద్దేశించి చేసే కామెడీతో మహేష్ బాగా హైలెట్ అయ్యాడు. ఇక భాషలోని యాస, పాతకాలంలో ఉన్న నిక్కరు బనీన్స్ తో మహేష్ అచ్చం పల్లెటూరి కుర్రాడిలానే ఉన్నాడు. అయితే రంగస్థలంలో మహేష్ నటనను మెచ్చి అందరూ అతన్ని అభినందించడానికి గాను తెగ ఫోన్స్ చేస్తున్నారట.

అలాగే అనేకమంది యూట్యూబ్ ఛానల్స్ వారు మహేష్ కి ఫోన్ చేసి ఇంటర్వ్యూ లు అడగడం కూడా చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మహేష్ మాట్లాడుతూ తన పాత్రకు, నటనకు వస్తున్న ప్రశంసల్లో తడిసి ముద్దయిపోతున్నానని.. తనకు ఇలాంటి గుర్తింపు వస్తుందని తాను అస్సలు ఊహించలేదని చెబుతున్నాడు. ఇక అందరూ చేసే ఫోన్ కాల్స్ వలన తన కొత్త ఫోన్ లో అస్సలు ఛార్జింగ్ ఉండడం లేదని… అన్ని కాల్స్ వస్తున్నాయని… అంతమంది తనని అభినందిస్తున్నారని ఎంతో సంతోషంగా చెబుతున్నాడు ఈ రంగస్థలం ఫెమ్ జబర్దస్త్ మహేష్.