టాప్ మోస్ట్ విలన్ ఆందోళన

టాలీవుడ్ లో క్లాస్ హీరోగా ఎదిగిన జగపతి బాబుకి బిగ్ గ్యాప్ రావడంతో… సినిమాల నుండి సైలెంట్ గా తప్పుకున్నాడు. కానీ బోయపాటి శ్రీను బాలకృష్ణ కోసం లెజెండ్ సినిమా లో జగపతి బాబుని విలన్ గా తీసుకున్నాడు. మరి ఆ సినిమాలో జగపతి బాబు విలన్ గా ఎలా ఉంటాడో.. ఎప్పుడూ క్లాస్ గా కనబడే జగపతి బాబు విలన్ గా ఎలా నెగ్గుతాడని అనుకున్నారు. కానీ జగపతి బాబు విలన్ గా తన విశ్వరూపం చూపించాడు. బోయపాటి… జగపతి బాబు లోని విలన్ ని బయటికి తీసుకొచ్చాడు. ఇక అప్పటినుండి టాలీవుడ్ లో టాప్ మోస్ట్ విలన్ గా జగపతి బాబు పేరు మార్మోగిపోయింది.

సాక్ష్యంతో మళ్లీ చాన్స్ ఇచ్చిన బోయపాటి

తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ కి అపోజిట్ గా జగపతి బాబు చేసిన క్లాస్ విలన్ యాక్టింగ్ కి అందరూ పడిపోయారు. అలాగే బోయపాటి మళ్లీ.. జయ జానకి నాయక సినిమాలో మరోసారి విలన్ పాత్ర ఇచ్చాడు. ఆ సినిమాలో పరువు కోసం కన్న కూతుర్నే చంపుకునే వాడిగా జగపతి బాబు అదరగొట్టేశాడు. ఇక సుకుమార్ రంగస్థలం లో జగపతి బాబు ప్రెసిండెంట్ ఫణింద్ర భూపతిగా అతి క్రూరమయిన మనసున్న సైలెంట్ విలన్ గా ఇరగదీసాడు. అయితే తాజాగా మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ కు విలన్ గా  జగపతి బాబు సాక్ష్యం సినిమాలో నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్దమై ప్రమోషన్స్ లో బిజీగా వుంది.

అతి క్రూరంగా మారనున్నాను…

సాక్ష్యం ప్రమోషన్స్ లో భాగంగా జగపతి బాబు ఆ సినిమా గురించి మట్లాడుతూ.. ఇంతవరకు, లెజెండ్, నాన్నకు ప్రేమతో, జయ జనకి నాయక సినిమాల్లో విలన్ గా చేసిన తాను అంతకు మించిన విలన్ పాత్రలో సాక్ష్యం సినిమా లో చేశానని…. సాక్ష్యం సినిమాలో నా పాత్రని చూసిన ఎవ్వరైనా.. ఇంతకన్నా నీచుడు ఉండడేమో అనే అభిప్రాయానికి వస్తారని.. అలాంటి దారుణమైన విలన్ పాత్రలో చేశానని చెప్పాడు. అలాగే ఇప్పటివరకు తాను చేసిన విలన్ పాత్రలను ప్రేక్షకులు క్షమిస్తారేమో గానీ… ఇప్పుడు సాక్ష్యంలో చేసిన విలన్ పాత్ర చూస్తే మాత్రం నన్ను క్షమించరు అంటూ… కేవలం డబ్బు ముఖ్యమనే పాత్రలో చేసిన నేను.. ఈ పాత్ర ప్రభావం నా నిజ జీవితం పైన కూడా పడుతుందేమో అని భయపడుతున్నాను అంటూ సాక్ష్యం సినిమాలో తన పాత్ర క్రూరత్వం గురించిన  విశేషాలు పంచుకున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*