జాక్ పాట్ కొట్టిన శ్రీదేవి కూతురు

శ్రీదేవి కూతురు హీరోయిన్ గా తన మొదటి సినిమా ‘ధడక్’ వచ్చేనెలలో రిలీజ్ కానుంది. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో మేకర్స్ ఈ చిత్రానికి ప్రొమోషన్స్ స్టార్ట్ చేశారు. బాలీవుడ్ లో కొంత మంది ముఖ్యంగా జాన్వికపూర్ నటన గురించి మాట్లాడుకుంటున్నారు.

ట్రైలర్‌లో జాన్వి నటనను చూసిన ఫిల్మ్ మేకర్స్ బాగా చేసిందన్నారు. దాంతో జాన్వికపూర్ సెకండ్ ఫిల్మ్‌కి కమిటైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ఈమె ఆఫర్ కొట్టేసినట్టు టాక్. ఈ బ్యూటీ పక్కన కార్తిక్ ఆర్యన్ హీరోగా కనిపించబోతున్నాడు. కార్తీక్ నటించిన ‘సోనుకు టిటుకి స్వీట్లీ’ మూవీ ఈ ఏడాది ఆరంభంలో రిలీజై బాక్సాఫీసు వద్ద కాసులు రాబట్టింది.

దాంతో కార్తీక్ ని హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలని సంజయ్‌లీలా బన్సాలీ ఫిక్స్ అయ్యాడు. మరి హీరోయిన్ ని ఎవరిని తీసుకుంద్దాం అని అనుకుంటున్నా టైంలో ‘ధడక్’ ట్రైలర్ విడుదల అయింది. అందులో జాన్వికపూర్ నటన బన్సాలీ నచ్చడంతో ఆమెను తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు బాలీవుడ్ మీడియా సమాచారం. మొత్తానికి ఫస్ట్ లుక్ ట్రైలర్ తోనే స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ క్యూట్ బేబీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*