ప్రచారంలో… ఇదొక ఎత్తు..!

Janhvi kapoor with dulqar salman

శ్రీదేవి కూతురిగా వెండితెరపై అరంగేట్రం చేసిన జాన్వీ కపూర్.. మొదట ఇషాన్ తో కలిసి ధఢక్ సినిమాలో నటించింది. ఆ సినిమా కేవలం శ్రీదేవి సింపతీ మీదే ఆడిందనేది జగమెరిగిన సత్యం. ఆ సినిమా షూటింగ్ టైం లోనే శ్రీదేవి అర్ధాంతరంగా కన్నుమూయడం… జాన్వీ కపూర్ ధఢక్ సినిమాకి సింపతీ రావడానికి కారణమయ్యింది. మరాఠీలో సైరత్ మూవీ ఎంత హిట్టో.. హిందీ రీమేక్ ధఢక్ ఆ మేర హిట్ కాలేకపోయింది. కేవలం జాన్వీ కపూర్ అట్రాక్షన్ వల్లే ఆ సినిమా నిర్మాతలకు లాస్ అనేది రాలేదు. ధఢక్ సినిమాలో కంటెంట్ బలంగా లేకపోవడంతో సినిమాకి యావరేజ్ టాకే పడింది.

ఒక్క సినిమాతోనే డేట్స్ లేవని…

ఇక ధఢక్ సినిమా తర్వాత జాన్వీ కపూర్ ఆ సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమాలో నటిస్తుంది అన్న ప్రచారమే కానీ.. ఇప్పుడు మాత్రం ఒక మ‌ల్టీస్టార‌ర్ కి ఓకె చెప్పింది. అలాగే మరో బిగ్ బ్యానర్ లో జాన్వీ కపూర్ నటిస్తుందని వార్తలొచ్చినప్పటికీ అది కేవలం ప్రచారంలో భాగమే అంటున్నారు. ఇక జాన్వీ చేతిలో ఓకే ఒక్క మల్టీస్టారర్ మాత్రమే చేతిలో ఉండగా… జాన్వీ కపూర్ డేట్స్ ఖాళీ లేక ఒక పెద్ద బ్యానర్ సినిమాకి నో చెప్పిందని న్యూస్ బాగా హైలెట్ అయ్యింది. దీంతో ఒక సినిమాకే డేట్స్ ఖాళీ లేవా పాపా అంటూ నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారు. మరి జాన్వీ కపూర్ నో చెప్పిందని చెబుతున్న వ్యక్తి ఎవరో కాదు.. స్వయానా తండ్రికే జాన్వీ నో చెప్పిందట.

శ్రీదేవి అంత కాకున్నా…

త‌న తండ్రి బోనీక‌పూర్ నిర్మించే మూవీకి జాన్వీ కపూర్ నో చెప్పిందనే విష‌యాన్ని భారీగా ప్ర‌చారం చేస్తున్నారు. మరి చేతిలో ఉన్న సినిమా ఒకటే అయినా.. ఇలా బయట ప్రచారం మొదలైంది అంటే.. ఇది కూడా పబ్లిసిటీ స్టెంట్ అంటున్నారు కొంతమంది. జాన్వీ కపూర్ అందం అభినయం అన్నీ అమ్మ శ్రీదేవితో పోల్చలేం కానీ. జాన్వీ కూడా అందమైన నటే. కానీ శ్రీదేవికి ఉన్న నటన, అందమైతే జాన్వికి పూర్తిగా అబ్బలేదు. ఇకపోతే జాన్వీ విషయంలో ఇలా ప్రచారం జరిగితుంటే జాన్వీ మాత్రం కురస నిక్కర్లతో కుర్రకారు మతులు పోగొడుతుంది. చిన్న చిన్న డ్రెస్సులతో కిర్రెక్కిస్తుంది. ఇక జాన్వీ చెల్లాయ్ ఖుషి కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అంటూ భారీగానే ప్రచారం మొదలైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*