ఒక్క సెల్ఫీతో రూమర్లకు చెక్

నిన్న శుక్రవారం సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయ్యింది. ఆ న్యూస్ అలాంటి ఇలాంటి న్యూస్ కాదు. స్టార్ హీరో కి, స్టార్ కమెడియన్ కి మధ్యన షూటింగ్ సమయంలో కోల్డ్ వార్ నడుస్తుందని, ఒక స్టార్ కమెడియన్ వలన ఎన్టీఆర్ ఈగో హార్ట్ అయ్యిందని, ఇలా అనేక రకాల హెడ్డింగ్స్ తో ఆ న్యూస్ హాట్ హాట్ గా వైరల్ అయ్యింది. అయితే ఆ స్టార్ హీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని… ఆ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అనే న్యూస్ మాములుగా స్ప్రెడ్ అవ్వలేదు. ఒకప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి లు గత కొంతకాలంగా దూరమైపోయారు. తన మీద ఎవరో చెడుగా చెప్పడం వలనే తనని ఎన్టీఆర్ దూరం పెట్టడాడని ఒకొనొక సమయంలో శ్రీనివాస్ రెడ్డి ఒక ఛానల్ సాక్షిగా బాధపడ్డాడు కూడా. కానీ అప్పుడే ఆ గ్యాప్ త్వరలోనే పోయి తాము దగ్గరవుతామని కూడా చెప్పాడు.

ఇద్దరి మధ్య విభేదాలని హల్ చల్….

కట్ చేస్తే ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అరవింద సామెత – వీర రాఘవ షూటింగ్ స్పాట్ లో శ్రీనివాస్ రెడ్డి కి, ఎన్టీఆర్ కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని… ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి తో మాట్లాడడం కానీ.. కనీసం మొహం తిప్పి చూడడం కానీ చెయ్యడం లేదని…. ఇక శ్రీనివాస్ రెడ్డి కూడా తన పాత్ర షూటింగ్ కంప్లీట్ కాగానే సైలెంట్ గా షూటింగ్ స్పాట్ నుండి జారుకుంటున్నాడని ఇలా ఒకటేమిటి ఎన్టీఆర్ – శ్రీనివాస్ రెడ్డి లపై రకరకాల కథనాలు ప్రచారం జరిగాయి.

రూమర్లకు చెక్ చెప్పారు…

కానీ ఈ రోజు శనివారం పొద్దున్నకల్లా ఎన్టీఆర్ – శ్రీనివాస్ రెడ్డి లు కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో దిగిన సెల్ఫీ సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మరి దీన్ని బట్టి ఏమర్ధమవుతుంది. నిన్న శుక్రవారం ఎన్టీఆర్- శ్రీనివాస్ రెడ్డి మధ్యన కోల్డ్ వార్ అనే న్యూస్ కేవలం రూమర్ అని.. వారు అరవింద సామెత షూటింగ్ స్పాట్ లో చాలా సఖ్యతగా ఉంటున్నారని… తమపై వచ్చిన వార్తలకు శ్రీనివాస్ రెడ్డి, ఎన్టీఆర్ లు ఒకే ఒక సెల్ఫీ తో చెక్ పెట్టారనేది ఆ సెల్ఫీ సారాంశం. మరి నిజంగానే వాళ్ళ మధ్యన కోల్డ్ వార్ ఏం లేదని.. వారు చాలా చక్కగా కలిసి మెలిసి పనిచేసుకుంటున్నారని తేలిపోయింది. మరి ఎన్టీఆర్, శ్రీనివాస్ రెడ్డి లు చాలా తెలివిగా తమ మధ్యన ఏం లేదని ఒకే ఒక పిక్ తో భలే సమాధానం చెప్పారు. ఇక త్రివిక్రమ్ కూడా ఆ సెల్ఫీ లో భాగమైయ్యాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సామెత షూటింగ్ ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా సాగుతుందని కూడా ఆ సెల్ఫీ చూస్తుంటే అర్ధమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*