బాలయ్య సఫర్.. చరణ్ హ్యాపీ

Ajay Devagan Rashmika Mandanna to act in charan ntr rajamouli cinema

బాలకృష్ణ ఇక మారడు. ఇలా అంటున్నది ఎవరో కాదు.. నందమూరి అభిమానులే. చంద్రబాబు కోసం అన్న కొడుకుని కాదనుకున్నాడు బాలకృష్ణ అని చాలామంది చాలా రోజుల నుండి అనుకుంటున్న విషయమే. సొంత అన్నగారు హరికృష్ణ రెండో భార్య కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ని ఎప్పటినుండో దూరం పెడుతున్నాడు బాలయ్య. బావగారి కళ్ళలో ఆనందం కోసం అన్నగారి కంట కన్నీళ్లు తెప్పించాడు. బాలకృష్ణ తప్ప నందమూరి ఫ్యామిలిలో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ని ఆదరిస్తున్నారు. అందులోనూ హరికృష్ణ మరణంతో నందమూరి ఫ్యామిలి ఒక్క తాటిపైకి వచ్చింది. అందులో బాలకృష్ణ కూడా ఉన్నాడు. కానీ హరికృష్ణ మరణములో మాత్రమే ఎన్టీఆర్ కి తోడుగా ఉన్న బాలయ్య ఎప్పటిలాగే మళ్ళీ ఎన్టీఆర్ ని దూరంపెట్టాశాడనే టాక్ తెలంగాణాల ఎన్నికల అప్పటినుండి నడుస్తుంది. ఇక ఎన్టీఆర్ కూడా బాలయ్య బాబుని లైట్ తీసుకున్నాడనిపిస్తుంది. అందుకే అక్కకు అండగా ఉన్న బాలకృష్ణ కి తెలంగాణ ఎన్నికల్లో అక్కకు సపోర్ట్ చెయ్యకుండా ఝలక్ ఇచ్చాడు.

కొన్ని సందర్భాల్లో బాబాయ్ బాలయ్య మీద అభిమానం ఉన్నప్పటికీ… కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్, బాలయ్యని కేర్ చెయ్యడం లేదు. తాజాగా ఎన్టీఆర్ బయో పిక్ లో కళ్యాణ్ రామ్ కి కేరెక్టర్ ఇచ్చిన బాలయ్య.. ఎన్టీఆర్ ని దూరం పెట్టేసాడు. ఇక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తాడన్నప్పటికీ.. బాలకృష్ణ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ని కూడా ఒప్పుకోలేదంటున్నారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ జరగబోయే ఈవెంట్ కి ఎన్టీఆర్ కి ఆహ్వానం కూడా అందలేదని న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ కూడా బాబాయ్ ని పక్కన పెట్టేసాడు. మరోపక్క మెగా ఫ్యామిలీ తోమంచి బాండింగ్ మైంటైన్ చేస్తున్నాడు.

రామ్ చరణ్ తో దోస్తీ.. చిరు తో హగ్స్ ఇవన్నీ బాలయ్య కి ఎన్టీఆర్ ఇస్తున్న షాకులే. రామ్ చరణ్ తో సినిమా ఒప్పుకుని మెగా ఫ్యాన్స్ కి దగ్గరయ్యాడు. రామ్ చరణ్ తో మంచి రిలేషన్ మైంటైన్ చేస్తూ చరణ్ తో బాగా క్లోజ్ అయ్యాడు. ఇక రామ్ చరణ్ వినయ విధేయరామ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడనే టాక్ నడుస్తుంది. మరి సంక్రాతి బరిలో ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయరామ లు పోటీ పడుతున్నాయి. అలా దగ్గర దగ్గర్లోనె రెండు సినిమాల ఈవెంట్స్ జరగబోతున్నాయి. మరి ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ కి ఎన్టీఆర్ ని పిలిస్తే స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యుండేవాడు. కానీ పిలవలేదు. ఇక చరణ్ వినయ విధేయరామ కి పిలిచాడు.. ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా స్పెషల్ ఎట్రాక్షన్ అవుతాడు. సో బాలయ్య పిలవకపోతేనేమిటి చరణ్ పిలిచాడు. మరి ఎన్టీఆర్ ని పిలవకపోతే.. బాలయ్య లాస్ అవుతాడు… చరణ్, ఎన్టీఆర్ ని పిలిచి తన సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తాడు. సో ఎన్టీఆర్ వలన బాలయ్య సఫర్ అయితే…. చరణ్ హ్యాపీ ఫీల్ అవుతాడన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*