కళ్యాణ్, ఎన్టీఆర్ లు కూడా అందుకు సిద్ధమవుతున్నారు

ntr happy with kalyanram 118

నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు జీవితంలో కోలుకులేని షాక్ తగిలింది. వాళ్ళ తండ్రి నందమూరి హరికృష్ణ అనుకొకుండా ఘోర రోడ్డు ప్రమాదానికి గురై గత బుధవారం కన్ను మూసారు. హరికృష్ణ మరణం నందమూరి కుటుంబానికి తీరని లోటు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోవడం ఆ అన్నదమ్ములకు చాలా కష్టమైనా పనే. ఇక నిన్న శుక్రవారం హరికృష్ణ చిన్న కర్మ ని కొడుకులు పూర్తి చేశారు. అయితే తండ్రి మరణంతో కుంగి పోయిన ఈ ఇద్దరు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు తమ పనుల్లో బిజీ గా మారిపోవడానికి మానసికంగా సిద్ధమవుతున్నారు.

ఒక పక్క ఫ్యామిలీ సపోర్ట్ తో తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇప్పుడు అదే ఫ్యామిలీ సపోర్ట్ తో తమ తమ సినిమా షూటింగ్ లకు వెళ్ళబోతున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత – వీర రాఘవ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వచ్చేనెల దసరా టార్గెట్ గా తెరకెక్కడంతో… నిన్నమొన్నటివరకు షూటింగ్ కి విరామం తీసుకోకుండా ఎన్టీఆర్ శ్రమించాడు. కానీ తండ్రి హఠాన్మరణంతో ఎన్టీఆర్ అరవిందకు బ్రేకిచ్చాడు.

మరి ప్రాజెక్ట్ కి బ్రేక్ ఇవ్వడమంటే మేకర్స్ ఎంత నష్టపోతారో తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్ కోసం తండ్రి మరణాన్ని జీర్ణించుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యాడని టాక్ వినబడుతుంది. సకాలంలో షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో త్రివిక్రమ్ తలమునకలై ఉన్నాడు. ఇక కళ్యాణ్ రామ్ నా నువ్వే ప్లాప్ తర్వాత మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా తండ్రి మరణంతో కుంగిపోకుండా నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా సినిమా షూటింగ్ కి వెళ్ళబోతున్నాడట. ఒక నిర్మాత బాధ మరొక నిర్మాతకు తెలుస్తుందని…. కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతే కదా.. మరి ఈ నందమూరి హీరోలకు హాట్స్అప్ చెప్పాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*