ఎన్టీఆర్ కూడా దిగుతున్నాడా?

junior ntr andhrapradesh elections

ఇప్పుడు స్టార్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అంతా ఒక పక్క సినిమాలు మరోపక్క పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్లు గా రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరోపక్క హీరోయిన్స్ అయితే ఏ షాప్ ఓపెనింగ్స్ కో వెళ్లి రిబ్బన్ కటింగ్ చేసినందుకు గాను లక్షల్లో ముట్టజెబుతున్నారు షాప్ యాజమాన్యాలు. అయితే అలాంటి సైడ్ కటింగ్ లే కాకుండా ఇప్పుడు స్టార్స్ అంతా సైడ్ వ్యాపారాల్లోకి వెళ్లిపోతున్నారు. అందులో ఇప్పుడున్న స్టార్ హీరోలు అయితే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ సినిమాలను, బిజినెస్ లను రెండిటీని హ్యాండిల్ చేస్తున్నారు. స్టార్ హీరోలో రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ బిజినెస్ తో పాటుగా తన తండ్రి సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా మారాడు. ఇక అల్లు అర్జున్ పబ్ బిజినెస్ లోకి వెళ్ళిపోయాడు. అలాగే ప్రభాస్ ఆ మధ్యన నెల్లూరు సమీపంలో ఒక మల్టిప్లెక్స్ ని కట్టిస్తున్నాడని.. అలాగే యువి క్రియేషన్స్ తో కలిసి వ్యాపారంలోకి దిగుతున్నాడనే ప్రచారం జరిగింది.

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు సినిమాల్తో పాటుగా బిజినెస్ లోకి దిగుతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఇప్పటివరకు వరుస సినిమాల్తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ గత ఏడాది బుల్లితెర మీద బిగ్ బాస్ హోస్టింగ్ తో అదరగొట్టడమే కాదు పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ మరో బిజినెస్ రంగంలోకి దిగుతున్నాడట. అది కూడా మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎన్టీఆర్ దిగితున్నట్టుగా టాక్. వ్యాపారం చేద్దామనే ఆలోచన రాగానే ఎన్టీఆర్ తెలిసిన బిజినెస్ అయితే బావుంటుందని… ఈ మల్టిప్లెక్స్ రంగాన్ని ఎన్నుకున్నట్లుగా చెబుతున్నారు.

అయితే ఈ మల్టిప్లెక్స్ థియేటర్స్ ని కేవలం ఒకే చోట కాకుండా హైద్రాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇలా ఏపీ, తెలంగాణల్లో విస్తరించాలనే యోచనలో ఎన్టీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదంతా తన ఒక్కడివల్ల కాదనుకున్న ఎన్టీఆర్ మరో వాటాదారునిగా దగ్గుబాటి సురేష్ అంటే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ని కూడా కలుపుకుపోతున్నాడని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ కు సపోర్ట్ గా నిర్మాత సురేష్ బాబు కూడా ఈ ప్రపోజల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి ఈ విషయాలన్నీ త్వరలోనే బయటికొస్తాయంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*