ఎన్టీఆర్ ను ఓదార్చిన మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుపై గత రెండు రోజులు నుండి వస్తున్న ఆరోపణలు అన్ని నిన్నటితో తొలిగిపోయాయి. నందమూరి హరికృష్ణ చనిపోయిన తర్వాత టాలీవుడ్ నుండి దాదాపు అందరు వచ్చి నందమూరి కుటుంబాన్ని పరామర్శించారు కానీ మహేష్ బాబు రాలేదని..ఇలా చేయడం కరెక్ట్ కాదని..మొన్న డైరెక్టర్ బి జయ చనిపోతే వెంటనే వెళ్లి బిఏ రాజుని పరామర్శించాడని. కానీ హరికృష్ణ చనిపోతే జూనియర్ ఎన్టీఆర్ ను కనీసం పరామర్శించడానికి రాలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మహేష్ పై ఫైర్ అవుతున్నారు.

ఎన్టీఆర్ కు పరామర్శ……

అయితే మహేష్ బాబు నిన్న ఈ చర్చకు తెర దించుతూ..నందమూరి కుటుంబాన్ని పరామర్శించాడు. హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్న సందర్భంగా నిన్న వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించాడు మహేష్. నిన్న హరికృష్ణ  ఇంటికి వెళ్లి నందమూరి కుటుంబ సభ్యులను ఓదార్చాడు.

గంటసేపు అక్కడే…..

ఆయన మృతి పట్ల సానుభూతి తెలిపాడు. దాదాపు గంటపాటు మహేష్ అక్కడే ఉన్నాడు. అయితే దానికి సంబంధించి ఫొటోస్ మాత్రం బయటికిరాలేదు. మహేష్ నందమూరి కుటుంబ సభ్యులను కలవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు. ఎన్టీఆర్ , మహేష్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*