#RRR టైటిల్ భలే ఉందిగా

rrr movie latest update telugu news telugu post

ఎస్ ఆ రోజు రానే వచ్చింది. #RRR మూవీ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి..ప్రభాస్..రానా..రాఘవేంద్ర రావు వంటి పెద్ద సెలెబ్రెటీస్ తో ఈవెంట్ కళకళలాడింది. చిరంజీవి క్లాప్ కొట్టగా…రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. రిలీజ్ కు ముందు నుండే ఈసినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడాయి.. దాంతో ఈచిత్రం కు సంబంధించి రోజుకొక రూమర్ వస్తూనే ఉంది.

జక్కన్న హీరోస్ ని తప్ప ఇతర నటుల గురించి గానీ, టెక్నీషియన్స్ గురించి గానీ ఎటువంటి హింట్ ఇవ్వలేదు. కాకపోతే ఈరోజు టెక్నీషియన్స్ పేర్లు రివీల్ చేసాడు. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో ఇంకో రూమర్ చక్కర్లు కొడుతుంది. ఈసినిమా వర్కింగ్ టైటిల్ #RRR అని అందరికి తెలిసిన విషయమే. అయితే లేటెస్ట్ గా ఈసినిమా టైటిల్ ‘రామ రావణ రాజ్యం’ అని రూమర్ హల్ చల్ చేస్తుంది. గతంలో కూడా ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు వచ్చాయి. అందులో ఒకటి ఈసినిమా లో విలన్ గా నటుడు రాజశేఖర్ ని తీసుకుంటున్నారు అని వచ్చింది. కొన్ని రోజులు పాటు #RRRR అని ట్రేడ్ చేశారు ఫ్యాన్స్. అయితే ఆ తర్వాత అది వట్టి పుకారేనని తేలిపోయింది.

మరో రూమర్ ఏమో ఎన్టీఆర్ ఇందులో విలన్ పాత్ర చేయబోతున్నాడని వచ్చింది. మరి ఆ పుకార్ల కోవలోనే ఈ సినిమా టైటిల్ ‘రామ రావణ రాజ్యం’ అన్నది కూడా వట్టి పుకారు గా ఉందా లేదా అన్నది వేచి చూడాలి. మరి ఈ రూమర్స్ అన్నిటికి త్వరలోనే బ్రేక్ పడనుంది. నవంబర్ 19 నుండి ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు జక్కన్న

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*