ఈ సినిమా పట్టాలెక్కేనా?

rrr movie latest update telugu news telugu post

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం #RRR కోసం మేకోవర్ అవుతున్నాడు. #RRR లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్, రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళిలో లుక్స్ పరంగా కాస్త డిఫరెంట్ గా కనబడుతున్నాడు. ఇక #RRR కోసం ఏడాదిన్నర కేటాయించిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్ తో చెయ్యబోతున్నాడో అనే క్లారిటీ లేదు. నిన్నమొన్నటివరకు ఎన్టీఆర్ #RRR తర్వాత కొరటాల శివతోనే సినిమా చేస్తాడని అన్నారు. కానీ తాజాగా కొరటాల శివ ప్లేస్ లోకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా వచ్చి చేరాడు. సందీప్ ,అర్జున్ రెడ్డి తర్వాత తెలుగు స్టార్స్ దొరక్క తన అర్జున్ రెడ్డి సినిమానే హిందీ లో రీమేక్ చేస్తున్నాడు.

ఆ సినిమా తర్వాత మహేష్ బాబు ని ఇంప్రెస్స్ చేసి మహేష్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడని.. మహేష్ కూడా సందీప్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి. అయితే మహేష్ తో సినిమా ఏమో కానీ.. ప్రస్తుతం సందీప్ వంగా ఎన్టీఆర్ కి ఒక పార్టీలో కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పినట్లు.. దానికి ఎన్టీఆర్ సరే కథ ప్రిపేర్ చెయ్యి చేద్దామని చెప్పినట్లుగా ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలోనూ, ఫిలింసర్కిల్స్ లోను చక్కర్లు కొడుతోంది. సందీప్ వంగా, ఎన్టీఆర్ కోసం మాస్ యాక్షన్ తో కూడుకున్న లవ్ స్టోరీ ని సిద్ధం చేసిన్నట్లుగా జోరుగా ప్రచారం మొదలైంది.

మరి ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకునే సందీప్ ఈ తరహా కథను ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసాడంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే అసలు ఎన్టీఆర్, సందీప్ వంగా కలిసిన ఆ పార్టీ ఏమిటో… పార్టీలో స్టోరీ లైన్ వినిపించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఎన్టీఆర్ ఫాన్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*