ఎన్టీఆర్ అసలు పారితోషకమే తీసుకోలేదట!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్… త్రివిక్రమ్ డైరెక్షన్ లో అరవింద సమేత సినిమా షూటింగ్ లో చాలా బిజీగా వున్నాడు. ఎందుకంటే గ్యాపులేకుండా జరుగుతున్న షూటింగ్ కి ఎన్టీఆర్ అస్సలు విరామమే తీసుకోవడం లేదట. అయితే అంత బిజీ షెడ్యూల్ లోను ఎన్టీఆర్ ఒక ఛానల్ కోసం తన రెండు గంటల టైం ని స్పెండ్ చేసాడు. ఈ టివి లో ప్రసారం అవుతున్న ఢీ10 డాన్స్ షో గ్రాండ్ ఫినాలేకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వెళ్ళాడు. అలా వెళ్లిన ఎన్టీఆర్ తన వాక్చాతుర్యంతో అందరి మనసులను గెలుచుకున్నాడు. అలాగే ఎన్టీఆర్ వచ్చిన ఆ ఫైనల్ ఎపిసోడ్ కి ఈ టివి కి అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. ఆ ఎపిసోడ్ ప్రసారం అయిన రోజు ఈ టివికి 13.9 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.

సోషల్ మీడియాలో ప్రచారం…..

అయితే అలా ఆ షోకి గెస్ట్ గా వెళ్లిన ఎన్టీఆర్ స్పెండ్ చేసిన రెండు గంటల టైం కి దాదాపుగా 25 లక్షల వసూలు చేసినట్లుగా సోషల్ మీడియాలో రూమర్స్ గుప్పుమన్నాయి. ఎన్టీఆర్ కేవలం రెండు గంటలకే 25 లక్షలు తీసుకుని తన క్రేజ్ ఏమిటో మరోసారి చూపించాడని.. ఇలా ఏవేవో కథనాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగాయి. అయితే అలా షో కి వెళ్లిన ఎన్టీఆర్ అసలు ఒక్క రూపాయి కూడా నిర్వాహకుల నుండి తీసుకోలేదట. కేవలం ఆ షో ని రన్ చేస్తున్న నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మీదున్న గౌరవంతోనే వాళ్ళు పిలవగానే ఎన్టీఆర్ ఆ షోకి గెస్ట్ గా వెళ్ళాడట.

నయా పైసా ఆశించకుండా…..

శ్యామ్ ప్రసాద్ రెడ్డి తో ఉన్న తన అనుబంధంతోనే ఎన్టీఆర్ ఈ షోకి నయా పైసా ఆశించకుండా వెళ్ళాడట. ఇక ఈ షో కి గెస్ట్ గ వచ్చినందుకు గాను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలిపాడట. మరి ఎన్టీఆర్ మొదటి సినిమా రామాయణాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. . ఎం.ఎస్ రెడ్డి తో కలిసి నిర్మించడం.. అప్పటినుండి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఎన్టీఆర్ కి మధ్య అనుబంధం కొనసాగుతుందని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*