అమ్మడికి అదృష్టం పట్టిందిగా..!

బాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ లేకపోయినా… టాలీవుడ్ కి రావడం రావడమే సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసిన కైరా అద్వాని.. ఆ సినిమాలో ఓ అన్నంత ప్రాధాన్యత కలిగిన పాత్ర చెయ్యకపోయినా అమ్మడు అందాలకు పడిపోవడంతోనో.. లేకుంటే అన్ని సినిమాల్లోనూ హీరోయిన్ పూజ హెగ్డే అంటే బాగోదనో… రామ్ చరణ్ – బోయపాటి సినిమాలో కైరా అద్వానీకి ఛాన్స్ తగిలింది. మరి ఎన్ని సినిమాలు చేసినా రాని అదృష్టం కేవలం మహేష్ బాబు పక్కన నటించడంతో తగిలిన క్రేజ్ తో… రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇంకా ఆ సినిమా పూర్తి కాకముందే కైరా కోసం అప్పుడే కొంతమంది దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారనే టాక్ వినబడుతుంది.

బాలీవుడ్ లోనూ భారీ ఆఫర్

రామ్ చరణ్ సినిమాలో నటిస్తున్న కైరా అద్వానీకి తెలుగులో మరో బిగ్ ప్రాజెక్ట్ లో అవకాశం తగిలేలా కనబడుతుంది. కేవలం ఇప్పుడు తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ కైరా అద్వానీకి ఒక బంపర్ ఆఫర్ తగిలింది. బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ నిర్మాణంలో వస్తున్న గుడ్ న్యూస్ అనే భారీ ప్రాజెక్టులో కైరా అవకాశం దక్కించుకోవడమే కాదు… . తాజాగా కైరా అద్వానీకి సౌత్ లో మరో భారీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కినట్లు సమాచారం. అది కూడా కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత అంతమంది అభిమానగణం ఉన్న ఇళయదళపతి విజయ్ పక్కన విజయ్ 63లో కైరాకి ఆఫర్ వచ్చిందనే న్యూస్ అయితే కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో హల్చర్ చేస్తుంది.

విజయ్ సరసన కోలీవుడ్ ఎంట్రీ

తేరి, మెర్సల్ సినిమాలతో విజయ్ తో కలిసి హిట్ అందుకున్న దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే.. విజయ్ 63వ సినిమాలో కైరా ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కబోయే.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని.. అలాగే ఈ సినిమాలో విజయ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తాడని టాక్ ఉంది. మరి టాలీవుడ్ లో మహేష్ తో తెరంగేట్రం చేసిన కైరా అద్వానీ.. కోలీవుడ్ లో విజయ్ సినిమాతో తమిళంలోకి తెరంగేట్రం చేస్తుంది. మరి ఇలాంటి బంపర్ ఆఫర్ అవకాశం ఎంతమంది హీరోయిన్స్ కి వస్తుంది చెప్పండి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*