పదేళ్లు అయ్యింది వచ్చి.. కానీ ఇప్పటికి కలిశారు

కాజల్ అగర్వాల్, గోపీచంద్ లు ఇద్దరు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ల పైనే అయింది. కానీ ఇంతవరకు వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. గోపీచంద్ అయితే అనుష్క, మెహ్రీన్ కౌర్, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్స్ తో కలిసి నటించాడు. కానీ… కాజల్ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయాడు. గతంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన మొగుడు సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చెయ్యాల్సి ఉంది. ఎందుకంటే కాజల్ మెయిన్ లీడ్ లో చందమామ సినిమాని డైరెక్ట్ చేసిన కృష్ణవంశి మొగుడు సినిమాకి కి డైరెక్టర్. అందుకే అప్పట్లో మొగుడు సినిమా కి కాజల్ అగర్వాల్ ని అడగగా.. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ గా బిజీ షెడ్యూల్ ఉండడంతో.. గోపీచంద్ పక్కన నటించే అవకాశం చేజార్చుకుంది.

అయితే గోపీచంద్ ఇప్పటికి ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయినా స్టార్ హీరో కాలేకపోయాడు. మీడియం రేంజ్ హీరోగా గోపీచంద్ మిగిలిపోయాడు. ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నాడు. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక సినిమా లో గోపీచంద్ సరసన కాజల్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి ప్రస్తుతం ఒక రేంజ్ లో యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది కాజల్. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ రెండు సినిమా లకు సంతకం చేసింది. అలాగే తమిళ క్వీన్ రీమేక్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది. తాజాగా ఇప్పుడు గోపీచంద్ మూవీ కి ఒప్పుకోవడం. మరి ఇలా కాజల్ మళ్ళీ రెండేళ్ల వరకు తన డైరీ ని ఫుల్ చేసేసింది