సూర్పణక పాత్రలో చందమామ

సౌత్ లో గత కొన్నేళ్ల నుండి చెలరేగిపోయిన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అటు సీనియర్ హీరోస్ తోను… ఇటు యంగ్ హీరోస్ తోను సమానంగా సినిమాలు చేసి తన కెరీర్ కు ఏ డోకా లేకుండా చూసుకుంది. కొంతమంది దర్శకులు అయితే కాజల్ ని కోరి మరీ సినిమాలో తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 50కి పైగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఎన్నో డిఫరెంట్ సినిమాలు చేసింది.

లేటెస్ట్ గా ఈమె ఒక పూర్తి పౌరాణిక చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు భార్గవ్ దర్శకత్వంలో రావణుడి సోదరి సూర్పణక పాత్రలో కాజల్ నటించడానికి రెడీ అవుతుందట. ఇది భారీ బడ్జెట్ తో ఫుల్ సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.

సూర్పణక పాత్ర అంటే రాముడిపై మనసు పారేసుకుని పాత్ర. ఒకరకంగా చెప్పాలంటే రామ రావణ యుద్ధం మొదలవ్వడానికి మొదటి కారకురాలు ఆమె. ఆ పాత్రకు సంబంధించి డిజైన్ ను సెట్ చేసుకొని కాజల్ ని ఊహించుకొని స్కెచెస్ వేశారట. అది కాజల్ బాగా నచ్చడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా తెలియాల్సిఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*