కాజల్ డేరింగ్ స్టెప్..!

బాలీవుడ్ లో ‘క్యూ హో గయానా’ అనే సినిమాతో తన నటన జీవితం ప్రారంభించి.. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచింది కాజల్ అగర్వాల్. కెరీర్ స్టార్టింగ్ లో పెద్ద హీరోలతో సినిమాల మీద సినిమాలు చేసిన కాజల్ ఈ మధ్య కాలం నుండి మీడియం హీరోస్ తో సినిమాలు చేస్తుంది. రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’..లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ తో ‘ఎమ్మెల్యే’ సినిమాల్లో నటించింది. దాదాపు 15 ఏళ్ళ నుండి సినిమాలు చేస్తున్న కాజల్.. అడపా దడపా హిందీలో సినిమాలు చేసినా అవి ఏమంత మంచి ఫలితాన్నందించలేదు. సౌత్ లోనే తన సినిమాలు ఎక్కువ హిట్ లు అవుతున్నాయి కాబట్టి ఇక్కడే తిష్ట వేసింది ఈ బ్యూటీ. అయితే త్వరలోనే కాజల్ కొత్త భాషా సినిమా ఒకటి చేయబోతుంది. తొలిసారిగా ఆమె పంజాబీ సినిమాలో నటించబోతోంది.

పంజాబీ సినిమా వర్క్ అవుట్ అయ్యేనా..?

ఆల్రెడీ ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ అయ్యిపోయిందంట. మన సౌత్ ఇండస్ట్రీ మార్కెట్ తో పోలిస్తే పంజాబీ ఇండస్ట్రీ చాలా చిన్నది. అక్కడి సినిమాల బడ్జెట్లు తక్కువ. పారితోషకాలూ తక్కువ. మరి పంజాబీ సినిమాకు కాజల్ ఎలా ఓకే చెప్పిందన్నది సందేహం. అందులోనూ అది ప్రయోగాత్మక చిత్రమట. ఏమాత్రం తేడా వచ్చిన వసూళ్లు అసలు రావు. చూద్దాం ఏమి జరిగిదో. ప్రస్తుతం కాజల్ తమిళ్ లో క్వీన్ రీమేక్ సినిమాలో నటిస్తుంది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*