నో అంటే మాత్రం అవకాశాలు ఆగుతున్నాయా..?

Media boycotted kajal programme

మగధీర సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించినా…ఖైదీ నెంబర్ 150 లో చిరంజీవికి జోడి కట్టినా ఆ భామ స్టైలే వేరు. చందమామ లాంటి అందంతో, సన్నజాజి నడుమందాలతో ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కి తన అందంతో పోటీ ఇస్తున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు కూడా చేతి నిండా సినిమాలతో బాగా బిజీగా వుంది. తమిళంలో బాలీవుడ్ క్వీన్ రీమేక్ ని పూర్తి చేసిన కాజల్ తెలుగులో ఒకేసారి ఒకే ఒక్క యంగ్ హీరోతో రెండు సినిమాల్లో నటిస్తుంది. అది కూడా హీరోయిన్స్ కి ధారాళంగా పారితోషం ఇచ్చే బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన. బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన అనుకోకుండా కాజల్ రెండు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. మరి ఒకేసారి ఒకే హీరోతో రెండు సినిమాల్లో రొమాన్స్ చెయ్యడం అనేది భలే గమ్మత్తయిన విషయమే. ఇక ఇప్పటికీ యంగ్ హీరోయిన్ అనే ఫీల్ అవుతుంది కాజల్. చిరు పక్కన భారీ పారితోషకానికి ఖైదీ నెంబర్ 150లో నటించిన కాజల్ అగర్వాల్.. వెంకటేష్ పక్కన నటించనని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఇక తాజాగా మరొక సీనియర్ హీరోకి కాజల్ నో చెప్పిందనే న్యూస్ హైలెట్ అయ్యింది.

రాజశేఖర్ అనగానే ఆలోచనలో పడింది…

హిట్ కోసం ఎంతో కాలం ఎదురుచూసిన హీరో రాజశేఖర్ కి పీఎస్వి గరుడావేగతో ఒక హిట్ ఇచ్చాడు ప్రవీణ్ సత్తారు. రాజశేఖర్ కన్నా ముందుగా సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లు సినిమాల మీద సినిమాలు చేస్తూ హిట్స్, ఫట్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. కానీ రాజశేఖర్ అనవసర కథలతో సినిమాలు చేసి చేతులు కాల్చుకుని గత ఏది ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గరుడ వేగ సినిమాతో మళ్లీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే గరుడవేగ తర్వాత భారీ గ్యాప్ తో రాజశేఖర్ మళ్లీ అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మరో మూవీ చెయ్యబోతున్నాడు. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని కోసం అ! సినిమాలో ఒక గెస్ట్ పాత్ర చేసిన కాజల్ ని రాజశేఖర్ ప్రక్కన హీరోయిన్ గా అనుకున్నాడట ప్రశాంత్ వర్మ. అందుకే రాజశేఖర్ పక్కన ఈ సినిమాలో నటించమని అడిగేందుకు కాజల్ ని కలిశాడట. అయితే కథ విన్న కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఉన్నప్పటికీ… హీరో రాజశేఖర్ అనగానే కాస్త ఆలోచించి చెబుతానని అందట. మరి హీరోలను చూసుకుని కాజల్ ఇలా నో చెప్పడం ఆమె కెరీర్ కి మంచిది కాదని మనమనుకుంటున్నాం. కానీ కాజల్ కి యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు ఇంకా ఇంకా తగులుతూనే ఉన్నాయి. అదేమరి లక్కంటే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*