కాజల్ కి కాస్త ఎక్కువైందంట..!

గత ఏడాది అవకాశాలు లేక గోళ్లు గిల్లుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మరో రెండేళ్లు డైరీ ఫుల్ చేసేసుకుంది. ఇప్పటికే బాలీవుడ్ క్వీన్ రీమేక్ లో తమిళంలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తుంది. అలాగే తేజ దర్శకత్వంలోనూ నటిస్తుంది. అయితే కాజల్ అగర్వాల్ కి ఐటెం సాంగ్స్ అంటే పెద్దగా నచ్చదట. ఎందుకంటే ఒకసారి ఐటెం సాంగ్ లో చేస్తే ఇక ఐటమ్స్ కె ఫిక్స్ అవ్వాలి కాబట్టే ఐటెం సాంగ్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదట ఈ భామకి. ఏదో ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధంతోనే కాజల్ జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ లో ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది.. కానీ ఆ తర్వాత వచ్చిన బోలెడన్ని ఐటమ్స్ కి కాజల్ నో చెప్పేసిందట.

సీనియర్ హీరోతోనూ వద్దు

మరి ఇప్పటికి ఇంకా హీరోయిన్ గా తన అందంతో అదరగొడుతున్న కాజల్ నిజంగానే చందమామ మాదిరి ఇప్పటికి ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉందో అలానే ఫిగర్ మెయింటైన్ చేస్తూ దర్శకనిర్మాతల దృష్టిలో పడుతుంది. మధ్యలో కాస్త డల్ అయినా… మళ్లీ అనూహ్యంగా పుంజుకున్న కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోలతో నటించేందుకు మొగ్గు చూపడం లేదు. కానీ స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు రావడం లేదు. అందుకే కుర్ర హీరోలతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది.

ఎంత ఇచ్చినా సరే నేను చేయను

అయితే ఇలాంటి టైం లో కాజల్ అగర్వాల్ కి అనుకోకుండా ఒక స్టార్ దర్శకుడు ఐటెం సాంగ్ అవకాశం ఇచ్చాడట. కానీ కాజల్ మాత్రం మీరు భారీ పారితోషకం ఇచ్చినా నేను ఐటెం సాంగ్ చెయ్యను అని నిర్మొహమాటంగా ఆ దర్శకుడికి చెప్పేసిందట. ప్రస్తుతం తాను ఐటెం సాంగ్స్ చేయడం లేదని .. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల పైనే ఫోకస్ పెట్టానని చెప్పిందట. మరి ఆ స్టార్ డైరెక్టర్ మాత్రం అడిగింది ఇస్తానని చెప్పినా ఈ ఆఫర్ ని కాలదన్నింది కాబట్టి కాజల్ కి కాస్త ఎక్కువైందని అనుకుని వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నాడట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


UA-88807511-1