సినిమాలు మానేస్తే బెటర్ ఏమో?

ప్రస్తుతం హీరోగా కళ్యాణ్ రామ్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. హీరోగా చేసిన సినిమాలన్నీ వరసబెట్టి ప్లాప్స్ అవుతున్నాయి. ఆయన కెరీర్ లో ఒకటి రెండు సినిమాలు హిట్ అయ్యాయి తప్ప మిగతా సినిమా లేవి అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఏమాత్రం నిరాశ పడకుండా సినిమాల మీద సినిమా లు చేస్తూనే ఉన్నాడు. ఈమధ్య తన తమ్ముడి ఎన్టీఆర్ క్రేజ్ ని వాడుకున్నా అతనికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్న ఒక్కటంటే ఒక్కటి హిట్ కావడం లేదు. మొన్నీమధ్యనే ఎమ్యెల్యే తో ప్లాప్ కొట్టిన కళ్యాణ్ రామ్ తాజాగా తమన్నాతో కలిసి నా నువ్వే అంటూ రేపు థియేటర్స్ లోకి దిగుతున్నాడు.

అయితే నా నువ్వే సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు.ఆ సినిమా ట్రైలర్ కానివ్వండి, టీజర్ కానివ్వండి ప్రేక్షకులను అస్సలు ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. తమన్నా కూడా నా నువ్వే ని కాపాడలేని పరిస్థితుల్లో నా నువ్వే సినిమా వుంది. ప్రస్తుతం తమన్నా కి కూడా ఏ మాత్రం క్రేజ్ లేదు. అందుకే ఆమె కళ్యాణ్ రామ్ తో కలిసి నటించడానికి ఒప్పుకుంది. అయితే తమన్నా అందాలు అయినా సినిమా ని సేవ్ చేస్తాయని అందరూ అనుకుంటున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు తమన్నాని చూసి బాగా బోర్ ఫీల్ అవుతున్నారు. అందుకే దర్శక నిర్మాతలెవరు తమన్నాకి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధపడడం లేదు. మరి తమన్నా మాత్రం నా నువ్వే ని ఎలా సేవ్ చేస్తుంది.

మరి సినిమా పబ్లిసిటీ లో కళ్యాణ్ రామ్ ఎక్కడా తగ్గడం లేదు. నా నువ్వే కి క్రేజ్ తెచ్చేందుకు ఆఖరికి తమ్ముడు ఎన్టీఆర్ ని కూడా నమ్ముకున్నాడు కళ్యాణ్ రామ్. నా నువ్వే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ని తీసుకొచ్చిన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అస్సలు నా నువ్వే మీద ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అందుకే చాలామంది కళ్యాణ్ రామ్ ఇక హీరోగా సినిమాలకు స్వస్తి చెబితే బావుంటుంది అనే కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇక హీరోగా సినిమాలకు బై చెప్పేసి నిర్మాతగా తన కెరీర్ ని చక్కబెట్టుకుంటే బావుంటుందంటున్నారు మరి కళ్యాణ్ రామ్ కి ఈ నా నువ్వే ఫలితం పాఠం నేర్పుతుందో.. లేదంటే మళ్ళీ మళ్ళీ అలానే చేస్తాడో అనేది రేపు ఈ పాటికి తేలిపోతుంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*