కళ్యాణ్ రామ్ నిజంగానే డిఫరెంట్ అబ్బా!

ఈమధ్య కాలంలో సినిమాల రన్ టైం విషయంలో డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ రాజీ పడటంలేదు. సినిమా లెంగ్త్ ఎక్కువగా ఉన్నా దైర్యంతో సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. ఒక్కప్పుడు రన్ టైం విషయంలో భయపడి ఎడిటింగ్ రూమ్ లోనే దానిని తగించడానికి చాలానే కసరత్తులు చేసేవారు. కానీ ఈమధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నీ లెంగ్త్ ఎక్కువ ఉన్న సినిమాలే. పైగా బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలు.

ఇవన్నీ మూడు గంటలే….

‘రంగస్థలం’..’అర్జున్ రెడ్డి’ సినిమా పూర్తి 3 గంటలు పాటు ఉన్న సినిమాలే. లేటెస్ట్ గా వచ్చిన ‘భరత్ అనే నేను’..’నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమాలు దాదాపు 3 గంటలు రన్ టైంతో వచ్చాయి. సినిమా ఎంటర్ టెయినింగ్ గా ఉండాలి కానీ సినిమా రన్ టైం పట్టించుకోమని నిరూపించారు ప్రేక్షకులు. కానీ నందమూరి కళ్యాణ్ రామ్ ఈ విషయంలో డిఫరెంట్ అనే చెప్పాలి.

ఇంత తక్కువ రన్ టైంలో…

తాను నటించిన లేటెస్ట్ మూవీ ‘నా నువ్వే’ రిలీజ్ కి రెడీ అవుంతుంది. ఈ సినిమా రన్ టైం 1.18 నిమిషాలే. అంటే రెండు గంటల కన్నా రెండు నిమిషాలు తక్కువే ఉంది. ఈమధ్య కాలంలో ఇంత తక్కువ రన్ టైంలో వచ్చిన సినిమా నా నువ్వే’. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ కాబట్టి సింపుల్ అండ్ స్వీట్ గా చెబితేనే బాగుంటుందని.. అనవసరమైన రిస్క్ అక్కర్లేదనే డైరెక్టర్.. కళ్యాణ్ రామ్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారంట.ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడిగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పాటలు మార్కెట్ లో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*