విజయ్ కి వదినగా సీనియర్ హీరోయిన్

vijya devarakonda in gullyboy remake

సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’తో వంద కోట్ల క్లబ్ లోకి చేరి ఆ తరువాత ‘నోటా’ అనే సినిమాతో మన ముందుకు వచ్చి నిరాశపరిచాడు. ఈ సినిమా రిజల్ట్ విజయ్ ను మరింత ఆలోచించేటట్టు చేసింది. ప్రస్తుతం అతను చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వంలో ‘టాక్సీవాలా’ అనే సినిమాతో ఈ నెల 17న మన ముందుకు రానున్నాడు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. అయితే తాజాగా ఇందులో సీనియర్ హీరోయిన్ కళ్యాణి కీలక పాత్రలో నటించిందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఆమె విజయ్ కు వదినగా నటించిందట. కథలో ఆమెది చాలా కీ రోల్ అని సమాచారం. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి అని తెలుస్తుంది.

వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈసినిమా ఫలితం విజయ్ దేవరకొండ కెరీర్ కి చాలా కీలకంగా మారింది. ఆల్రెడీ ఈసినిమా రెండు నెలల కిందట పైరసీ ప్రింట్ నెట్ లోకి వచ్చేసింది. చాలామంది ఈమూవీని చూసేసారు కూడా. దాంతో ఈసినిమాకు అసలు ఓపెనింగ్స్ అన్న అవుతాయా అన్న అనుమానం రాక మానదు. చూడాలి మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*