కళ్యాణ్ రామ్ తో నాగార్జున..!

Akkineni Nagarjuna manmadhudu 2

కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాతో కం బ్యాక్ అయ్యాడు. ‘పటాస్’ తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ రాలేదు. దీంతో కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తానే హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని డైరెక్షన్ లో ఈ సినిమా చేయడానికి కళ్యాణ్ రామ్ ఒకే చెప్పాడంట. అయితే ఇది మల్టీ స్టారర్ కావడం విశేషం. ఇందులో ఒక హీరోగా కళ్యాణ్ రామ్ కాగా.. మరో హీరో కోసం ఓ సీనియర్ స్టార్ హీరోని సంప్రదించినట్టు టాక్. ఈ సినిమాకు మరో హీరోగా నాగార్జున అయితే బాగుంటదని కళ్యాణ్ రామ్ ఆలోచనట. అంతే వెంటనే నాగ్ కు పవన్ స్టోరీ చెప్పడం, అయన ఓకే అనడం జరిగిపోయాయి.

కొత్తదనానికి ఓకే చెప్పిన నాగ్

ఈ సినిమాలో నాగ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ .. ఆ కొత్తదనం కారణంగానే ఆయన కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున.. నానితో ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే కళ్యాణ్ సినిమాతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*