కమల్ హాసన్, దిల్ రాజు మోసం చేశారు..!

Kamal Hasan going to quit acting

ప్రేక్షకులకి ఈ మధ్య సినిమాల్లో హడావిడి.. నాలుగు సాంగ్స్ ఉంటె సరిపోదు. కథ కథనం ఉంటేనే చూస్తున్న రోజులవి. ఈ వారం రిలీజ్ అయిన రెండు సినిమాల విషయంలో ఇదే జరిగింది. మొదటిగా కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ చూసుకుంటే.. మొదటి భాగంలో ఎడిటింగ్ టేబుల్ దగ్గర వదిలేసిన కొన్ని సన్నివేశాలు, అంతకు ముందే చిత్రీకరించిన క్లైమాక్స్ తో కలిపి రెండు గంటలకు సెట్ చేసి సినిమాలా విడుదల చేస్తే జనాలు గుర్తుపట్టలేరేమో అనుకున్నారు కమల్. కానీ గుర్తు పట్టడమే కాదు కమల్ ఫ్యాన్స్ కమల్ పై ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి ఇది కమల్ బిజినెస్ ట్రిక్. తన సినిమా రెవెన్యూపరంగా వర్క్ అవుట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా చేసారు. కాకపోతే రెవెన్యూపరంగా వర్క్ అవుట్ అవుతుందేమో కానీ సినిమా కథ విషయంలో ఫాన్స్ తో సహా ప్రేక్షకులందరూ తీవ్రంగా నిరాశ చెందారు. ఇటువంటి కథను కమల్ నుండి ఆశించలేదని తమ ఆవేదనని బయటికి చెబుతున్నారు.

శ్రీనివాస కళ్యాణం కూడా అంతే..!

ఈ సినిమానే కాదు దిల్ రాజు నిర్మాణంలో ఈ వారంలో వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ కూడా అంతే. ఆయన కూడా లాంగ్ వీక్ ఎండ్ ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని ఆపలేకపోతున్నారు. ఒక సినిమా సక్సెస్ కాగానే సేమ్ అదే ఫార్ములాతో ఇంకో సినిమా తీస్తే జనాలు చూసే రోజులు కావు ఇవి. రిలీజ్ కి ముందు ఎంత బాగా ప్రొమోషన్స్ చేసిన అది మొదటి రోజు వసూళ్లకు తప్ప ఇంకెందుకు ఉపయోగపడదు. సినిమాలో విషయం ఉంటె రెండో రోజు నుండి ఆ సినిమానే తీసుకుని వెళ్తుంది. ప్రేక్షకుల నాడిని పసిగట్టి దానికి తగ్గ కథలతో మెప్పించినప్పుడే వసూళ్లయినా మెప్పు అయినా దక్కేది. ఆలా చేయకపోతే సినిమా రిజల్ట్ ఇలానే ఉంటుంది. సో ఇకనైనా సినిమాలు రిలీజ్ విషయంలో జాగ్రత్త పడతారని ఆశిద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*