బ్యాడ్ టాక్ తో అన్ని కోట్లా..?

kanchana 3 movie collections

రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 సినిమా గత శుక్రవారం విడుదలైంది. తెలుగులో నాని జెర్సీ సినిమాతో పోటీపడిన కాంచన 3 తమిళంలో సోలో ఫైట్ కి దిగింది. కాంచన 3 విడుదలైన ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాంచన సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాని క్రిటిక్స్ కూడా తూర్పారబట్టారు. అయితే విచిత్రంగా టాక్ తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న జెర్సీకి షాకిస్తూ అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టింది. ఇక తమిళనాట కాంచన 3 బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరి క్లాస్ మూవీస్ గా మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలకు వచ్చిన టాక్ మాస్ మూవీ కాంచన 3కి రాకపోయినా… కాంచన 3 మాత్రం ఆ క్లాస్ మూవీ కలెక్షన్స్ కి అందనంత ఎత్తులో నిలబడింది.

100 కోట్ల క్లబ్ లో…

వరల్డ్ వైడ్ గా కాంచన 3 మొదటి వారం ముగిసే సరికి ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలకే షాకిచ్చింది. బ్యాడ్ టాక్ తో ఇన్ని కోట్లు కొల్లగొట్టిన కాంచన 3 కన్నా… మాస్ ప్రేక్షకుల నాడిని అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదనేది కాంచన 3 ప్రూవ్ చేసి చూపించింది. మరి ఇంతటి నెగెటివ్ టాక్ తో కాంచన 3 100 కోట్లు కొల్లగొట్టి… రాఘవని మొదట్టమొదటిసారిగా 100 కొట్ల క్లబ్బులో అడుగుపెట్టేలా చేసింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న కాంచన, గంగ సినిమాలు కూడా కొల్లగొట్టని ఫిగర్ ని బ్యాడ్ టాక్ తో కాంచన 3 కొల్లగొట్టింది.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*