గొడవలు లేవంటూనే… అన్ని చెప్పేస్తోంది..!

ఈమధ్యన బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు దర్శకుడు క్రిష్ కి, హీరోయిన్ కంగనా రనౌత్ కి మధ్యన విభేదాలంటూ సోషల్ మీడియా దగ్గర నుండి… వెబ్, ప్రింట్ మీడియా వరకు బాగా ప్రచారం జరిగింది. అయితే ఈ విభేదాల గురించి దర్శకుడు క్రిష్ కామ్ గా ఉండడం… కంగనా తమ మధ్యన ఎలాంటి విభేదాలు లేవంటూ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అయినా, మణికర్ణికా విషయంలో చాలానే సమస్యలు దర్శకుడు క్రిష్ కి, కంగనకి ఉన్నట్టుగా వార్తలు రావడం మాత్రం ఆగడం లేదు. కంగనా ఏదో మా మధ్యన మణికర్ణికా విషయంలో విభేదాలు లేవని చెప్పినా… వారి మద్యన నిజంగానే గొడవులున్నాయని కొన్ని విషయాల్లో కంగనా రివీల్ చేస్తూనే ఉంది.

క్రిష్ పేరుకి బదులు కంగనా…

మణికర్ణికా సినిమా విషయంలో కంగనాతో విభేదించిన క్రిష్ సైలెంట్ గా టాలీవుడ్ లో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయో పిక్ విషయంలో బిజీ అయ్యాడు. ఇక కంగనా మణికర్ణికా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఓన్ గా చూసుకుంటుందని టాక్ ఉంది. అయితే ఈ మధ్యన తాజాగా కంగనా మణికర్ణికా పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో క్రిష్ ని తప్పించి తన పేరునే హైలెట్ చేసుకుంటుందంటున్నారు. అయితే ఆ విషయం నిజమనే సంకేతాలు కనబడుతున్నాయి. ఎలా అంటే కంగన డైరెక్షన్ లో అంటూ మణికర్ణిక క్లాప్ బోర్డ్పై ప్రింట్ చేసింది అంటూ ఇప్పుడొక క్లాప్ బోర్డు ఫోటో సోషియల్ మీడియాలో హంగామా చేస్తుంది.

విభేదాలు లేవని చెబుతున్నా…

ఇక అదేమిటి కంగనా పేరు డైరెక్షన్ లో కనబడం చూసి ఆమెని ప్రశ్నిస్తే… అదేం లేదు క్రిష్ మణికర్ణికా డైరెక్టర్ అని చెబుతూనే మా మధ్యన విభేదాలు లేవని చెబుతుంది. అలాగే ఈ విషయాలపై తనకు కాకుండా తన తన తరుపున తన పీఆర్వో రాజేష్ మాట్లాడడం చూస్తుంటే కంగనాకు, క్రిష్ కి మధ్యన చెడిందనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ విషయమై ఇప్పటివరకు దర్శకుడ క్రిష్ స్పందించక పోవడం కూడా పలు అనుమానాలు తావిస్తుంది.