హాట్ హాట్ గా అదరగొడుతుంది..!

kangana comments on krish

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా సంచలనమే. ఏం చేసినా సంచలనమే. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో మణికర్ణిక అనే చారిత్రాత్మక చిత్రాన్ని చేస్తుంది. ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మణికర్ణిక చిత్రాన్ని క్రిష్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడని అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంతవరకు మణికర్ణిక సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. అలాగే ఆ సినిమా పక్కాగా ఆగష్టు 15 న విడుదలవుతుందని నమ్మకం లేదు. అయితే దర్శకుడు క్రిష్ ప్రస్తుతం మణికర్ణిక పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులను చూసుకుంటున్నాడు.

హాట్ డ్రెస్ లో పోజు…

ఇకపోతే కంగనా తాజాగా ఒక బికినీ ఫోటో ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయ్యింది. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం కంగనా ఒక బికినీ వేసి అందరి మతులను పోగొట్టింది. కళ్లను పోలి ఉండే డిజైన్ తో వెరైటీ గా రూపొందిన బికినీలో కంగనా చూసే చూపులకు కుర్రకారు గుండెలు జారిపోవడం ఖాయం. మరి కంగనా రనౌత్ ని ఆ బికినీ పోజులో ఉండగా… మణికర్ణికగా ఊహించుకుని కాస్త షాక్ తింటున్నారు కూడా. అమ్మో కంగనానేనా ఇలా కనబడేది అంటూ… ఆశ్చర్యపోతున్నారు. కానీ కంగనా ఎవ్వరిని లెక్కచెయ్యని భామ. ఎవరెన్ని చెప్పినా కంగనా మాత్రం తాను అనుకున్నదే చేస్తుంది. అందుకే ఇలా బికినీ వేసుకుని అందరికి షాక్ ఇచ్చింది. కంగనా వేసిన ఆ బికినీ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చీర కట్టులో, హాట్ హాట్ డ్రెస్సులలో ప్రత్యేకత చూపించే ఈ గ్లామర్ బామ ప్రస్తుతం మణికర్ణిక కన్నా ఎక్కువగా ఈ బికినీ తోనే పాపులర్ అయ్యేలా వుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*