‘మణికర్ణిక’ లో అన్నీ తానైన కంగన..!

telugu news

క్రిష్ డైరెక్షన్ లో ఝాన్సీ రాణి జీవిత కథగా తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ సినిమాలో టైటిల్ రోల్ లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరిలో రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వలేదు. కొంత ప్యాచ్ వర్క్.. కొన్ని సీన్స్ బాలన్స్ ఉన్నాయి. కానీ క్రిష్ మాత్రం ఈ సినిమాను పటించుకోకుండా ‘ఎన్టీఆర్’ బయోపిక్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

కంగననే అన్నీ చూసుకుంటోంది..!

దీంతో ఆ ప్యాచ్ వర్క్… బాలన్స్ సీన్స్ ను హీరోయిన్ కంగనా తీసేస్తుందంట. ఎంత జాగ్రత్త పడినా ఈ న్యూస్ మీడియాకు లీక్ అయ్యి వైరల్ అవుతుంది. వాస్తవానికి ఈ సినిమాకు మొదట డైరెక్టర్ క్రిష్ కాదు. కొన్ని కారణాలు వల్ల క్రిష్ ను తీసుకుంది. ఇప్పుడు ఈ న్యూస్ పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ మొత్తం కంగననే చూసుకుంటోంది. పైగా ఆమె ఫిలిం డైరెక్షన్ కోర్స్ చేశానంటూ చెబుతుంది. మరి డైరెక్టర్ క్రిష్ కు ఇవన్నీ తెలిసే వదిలేసాడా..? లేక ఈ విషయాలు క్రిష్ కు తెలియలేదా..? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఏదైతేనేం అనుకున్న టైంకి మన ముందుకు ‘మణికర్ణిక’ వచ్చేస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*