#RRR కోసం బాలీవుడ్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్

#RRR Telugu News telugu post

#RRR సినిమా షూటింగ్ కొన్ని రోజుల కిందటే స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈసినిమా షూటింగ్ చివరకు స్టార్ట్ అవ్వడంతో ఈసినిమా యొక్క బిజినెస్ కోసం రైట్స్ కోసం ఇప్పటి నుండే ఎగబడుతున్నారట. శాటిలైట్ రైట్స్…డబ్బింగ్ రైట్స్..ఆడియో రైట్స్…డిజిటల్ రైట్స్ ఇలా అన్ని రైట్స్ కోసం పలు సంస్థలు..పలు వ్యక్తులు రంగంలోకి దిగిపోయారు. అందులో ఒక్కరు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్.

‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి రేంజ్ ఏంటో తెలుసుకున్న కరణ్ ‘బాహుబలి’ కి లాభాలు రావడంతో మరోసారి రాజమౌళి సినిమాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని అనుకుంటున్నాడు. అందుకు ఎంతైనా ఇవ్వడానికి రెడీ గా ఉన్నాడు. రాజమౌళి పరిచయంతో..ప్రభాస్ – రానాలను యూజ్ చేసుకుని తారక్ – చరణ్ లకు ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చి ఈసినిమా యొక్క హిందీ రైట్స్ ఎలాగైనా దక్కించుకుంద్దాం అని చూస్తున్నాడు.

కరణ్ ఆల్రెడీ ఈసినిమా దర్సకనిర్మతల తో మాట్లాడి నట్లు తెలుస్తుంది. అయితే యూనిట్ మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఎలాంటి చర్చలు పెట్టుకోవద్దని నిర్ణయించుకుంది. ఆ తరువాత ఓ మంచి రోజు బిజినెస్ గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నారట. తారక్ – చరణ్ నటిస్తున్న ఈసినిమాలో ఇతర నటీనటులు పేర్లు ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే ఆ పేర్లు అధికారంగా ప్రకటించనున్నారు మేకర్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*