సావిత్రి పాత్ర అందుకే వదిలేశా: కీర్తి

‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర పోషించి మంచి పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. తెలుగులో పాటు తమిళంలో కూడా ఒకేసారి ఇమేజ్ తెచ్చుకున్న కీర్తి.. ఒకపక్క సావిత్రి కీర్తి కిరీటం నెత్తిన పెట్టుకోవ‌టం అదే రీతిలో కాపాడుకోవ‌టం అంటే మాములు విషయం కాదు. ఇటువంటి ఇమేజ్ వచ్చినప్పుడు ఏ హీరోయిన్ అయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా చూసుకుంటున్నారు. కానీ సావిత్రి అందుకు పూర్తి వ్యతిరేకం.

ఎన్టీఆర్ సినిమాలో…..

రీసెంట్ గా ఆమెకు ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రి పాత్ర పోషించ‌టానికి అవ‌కాశం వ‌చ్చింది. అయితే కీర్తి మాత్రం ఆ పాత్ర పోషించే అవ‌కాశాన్ని వదిలేసుకుంది. దానికి కారణం ఏంటో తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఒకరకంగా ఆమె చెప్పింది వింటే ఆమె వాద‌న‌కు క‌న్వెన్స్ కావ‌టం ఖాయం. అసలు ఇంతకు ఆమె ఏమి చెప్పిందంటే.

ఏ బయోపిక్……

మహానటి సావిత్రి పాత్ర పోషించడం అంటే అది ఒక గొప్ప అనుభూతి. మహానటి ఒక అంద‌మైన కిరీటమ‌ని.. దాన్ని అలానే చూడాలే కానీ తాక‌కూడ‌ద‌ని అందుకే ఎన్టీఆర్ సినిమాలో ఆ పాత్ర చేయడానికి నో చెప్పానని చెప్పింది. అంతేకాదు ఇకపై ఏ బ‌యోపిక్ కూడా చేయ‌కూడ‌ద‌ని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పటం విశేషం. మరి ఎందుకని ఇటువంటి డెసిషన్ తీసుకుందో కీర్తికే తెలియాలి..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*