ఎందుకమ్మా.. ఇలా?

మహానటి తో నటిగా ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్ కి అందం ఆకర్షణ అన్ని ఉన్నాయ్. కానీ కాస్త బరువుతో బాధపడే.. ఈ నటికి స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు సులువుగానే వచ్చేసాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ కి టాలీవుడ్ లో నటించే టైం లేదని చెబుతుంది. అంతేలే కోలీవుడ్ లో విజయ్, విక్రమ్… ఇలా అందరి హీరోలను చుట్టేస్తున్న కీర్తి కి టైమెలా ఉంటుంది. పెద్దగా గ్లామర్ పాత్రలను టచ్ చెయ్యని కీర్తి సురేష్ ఎక్కువగా ట్రెడిషనల్ గా వుండడానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అయితే సినిమాల సంగతెలా ఉన్నప్పటికీ.. కీర్తి సురేష్ ఏదైనా ఈవెంట్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అనే దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మేకప్ విషయంలో ఇవ్వదనిపిస్తుంది. ఆమె హాజరైన రెండు మూడు ఈవెంట్స్ కి కీర్తి వేసుకున్న మేకప్ ఆమె అందాన్ని పూర్తిగా మర్చేశాయి.

పవన్ సరసన…….

అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కీర్తి సురేష్ ఆ సినిమా ఆడియో లాంచ్ వేడుక టైం లో చీరకట్టులో బొద్దుగా కనిపించి వెగటు పుట్టించినా… ఆమె నటనకు అందరూ సర్దుకుపోయారు. కానీ ఆమె వేసిన మేకప్ కానీ. లిప్ స్టిక్ కి గాని ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. అందమైన చీర లో నల్ల లిప్ స్టిక్ తో లూజ్ హెయిర్ అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో పెద్దగా ఎవరిని ఆకర్షించలేకపోయింది. ఇక తాజాగా మరో ఈవెంట్ లో కీర్తి సురేష్ వేసిన మేకప్ చర్చనీయంశమైంది. కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో జరిగే ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుక అయినా సైమా అవార్డ్స్ లో చక్కటి డిజైనర్ గౌన్ లో మెరిసింది.

చూడ్డానికి చికాకు కల్గించేలా…….

కానీ ఆ డ్రెస్సుకి తగ్గ హెయిర్ స్టయిల్ లో కానీ, మేకప్ కానీ చూడడానికి చికాకు పుట్టించేలా ఉన్నాయి. అందమైన వైట్ గౌన్ వేసుకుని.. పెడలాంటి మేకప్ తో కీర్తి సురేష్ వెగటు పుట్టించింది. అందమైన మొహానికి అతిగా మేకప్ వేసుకుని… ఉన్న అందాన్ని చెడకొట్టుకుంది ఈ మహానటి. మహానటి సినిమాలో సావిత్రిలా అందమైన నటన కనబర్చిన కీర్తి సురేష్ ఇక్కడ పేడ లాంటి మేకప్ తో అందరి మతులు పోగొట్టింది. అసలు కీర్తి సురేష్ ని అలాంటి మేకప్ లో చూస్తే మాత్రం.. ఏమిటమ్మా కీర్తి ఈ మేకప్.. నీకసలు టేస్ట్ లేదా అని అడగలనిపిస్తుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*