కీర్తిని ఆలా చూడలేక పోతున్నారు..!

keerthi suresh may act in rajanikanth movie

ఏది జరగకూడదు అని అనుకున్నామో అదే జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే కీర్తి సురేష్ ను హీరో విక్రమ్ పక్కన ‘సామీ’లో ఓ నాసిరకం గ్లామర్ పాత్రలో చూడలేక అల్లాడిపోయారు తన ఫ్యాన్స్. విక్రమ్ తో కీర్తి చేస్తుంటే ఏదో చిన్న పిల్ల చేస్తున్నట్టు కనిపించింది. దానికి తోడు గ్లామర్ పాత్రలో తనను చూడలేకపోయారు అభిమానులు. విక్రమ్ ‘సామీ’ మొదటి పార్ట్ చేసినప్పుడు కీర్తి వయసు 11. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ 15 ఏళ్ల తర్వాత ఆయన పక్కన నటిస్తే ఇలానే ఉంటుంది.

విశాల్ తో చేస్తున్నా…

‘మహానటి’లో ఆమెను సావిత్రి పాత్రలో చూసిన తర్వాత గ్లామర్ డాల్ గా చూసేందుకు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. ప్రస్తుతం కీర్తి ‘పందెం కోడి 2’ సినిమా మన ముందుకు రాబోతుంది. ఇందులో ఆమెకి జోడిగా విశాల్ నటించాడు. విశాల్.. కీర్తి పక్కన పర్లేదు అనిపిస్తాడు. ఇందులో ఈమెది పల్లెటూరు అమ్మాయి పాత్ర కాబట్టి పెద్దగా ప్రత్యేకత ఏమీ ఉండదు. విశాల్ కి ఎదురు నిలబడే పాత్రలో తన లవర్ వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుంది. సినిమాలో ఆమె పాత్రకే ఎక్కువ వెయిటేజ్ ఉందని టాక్.

మహానటి ఇమేజ్ నుంచి బయటకురావాలి..!

అలానే విజయ్ – మురుగదాస్ కాంబినేషన్ లో ‘సర్కార్’ అనే సినిమా రూపొందుతోంది. అందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. వీరి జోడి తెరపైన చూడటానికి బాగానే ఉంటుంది. కానీ గత కొంత కాలంగా తన సినిమాల్లో హీరోయిన్లను దాస్ సరిగా ప్రొజెక్ట్ చేయటం లేదు. వయసు ఎక్కువ హీరోస్ తో చేయొద్దని కీర్తి అభిమానులు కోరుతున్నారు. అది ఏమి ఆమెకు తెలియక కాదు. స్టార్ డం ఉన్న హీరోస్ అంతా పెద్ద వయసు వాళ్లే. గతంలో నయనతార సైతం కెరీర్ ప్రారంభంలో రజనీ లాంటి సీనియర్ పక్కన చేసి తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సో ఆ ‘మహానటి’ హ్యాంగ్ ఓవర్ నుండి బయటికి వచ్చి చూస్తే బెటర్ అని అప్పుడే మనం ఆమె ఏ పాత్ర చేసిన నచ్చుతుందని అంటున్నారు కొంతమంది. ఆలా ఫలానా హీరోతోనే చేయాలని బీష్మించుకు కూర్చుకుంటే కష్టం అని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*