కీర్తి సురేశ్ మళ్లీ కనపడేది ఆ సినిమాలోనే

keerthi suresh may act in rajanikanth movie

రామ్ సరసన హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంటరైన కీర్తి సురేష్ ‘నేను శైలజ’తో సూపర్ హిట్ కొట్టింది. వెంటనే నేచురల్ స్టార్ నాని తో నేను లోకల్ సినిమా చేసింది కీర్తి సురేష్. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అప్పటి నుండి కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ లా అవకాశాలు ఆమె వెంట పడ్డాయి. ఇక్కడ రెండు హిట్స్ తో ఉన్న కీర్తి సురేష్ కోలీవుడ్ లోనూ గట్టిగా జెండా పాతేసింది. ఇక టాలీవుడ్ లో ఆమెకి ఎదురుండదు అనుకున్న టైం లో అజ్ఞాతవాసి ఆమెకి పిచ్చెక్కించే ఫ్లాప్ ఇచ్చింది. ఇక అమ్మడు పని అవుట్ అనుకునేలోపు మళ్ళీ మహానటి తో బంపర్ హిట్ కొట్టింది కీర్తి సురేష్. ఇక టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకుంటే… ఆమె కోలీవుడ్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ టాలీవుడ్ కి ఇవ్వడం లేదనే టాక్ బయలు దేరింది.

నాని జెర్సీలో కీర్తి సురేష్

అయితే తాజాగా నేచురల్ స్టార్ నాని తో కలిసి కీర్తి సురేష్ మరోసారి జోడి కట్టబోతుంది అనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ప్రస్తుతం నాని… నాగార్జున తో కలిసి మల్టీస్టారర్ సినిమాతో పాటు మళ్ళీ రావా డైరెక్టర్ గౌతమ్ డైరెక్షన్ తో కలిసి జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. అయితే జెర్సీ సినిమాలో నాని పక్కన ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. ఈ మధ్యన నాని సరసన శృతి హాసన్ అనే వార్త బాగా హైలెట్ అయ్యింది. అయితే తాజాగా శృతి హాసన్ ప్లేస్ లో కీర్తి సురేష్ పేరు వినబడుతుంది. ఎందుకంటే నాని – కీర్తి సురేష్ లు కలిసి నేను లోకల్ సినిమాలో నటించి మంచి హిట్ అందుకున్నారు.

కోలీవుడ్ లో బిజీగా…

క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న జెర్సీ కోసం నాని సరసన కీర్తి సురేష్ పేరు ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నాని జెర్సీ సినిమా కోసం క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇక గౌతమ్ – నాని లు కీర్తి పేరునే ఫైనల్ చేస్తారనే సమాచారం అందుతుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో విశాల్ తో పందెం కోడి సీక్వెల్, ధనుష్ తో మారి సీక్వెల్, విజయ్ సర్కార్ మూవీలో నటిస్తుంది. ఇక నాని తో కీర్తి సురేష్ ఫైనల్ అయితే.. మహానటి తర్వాత తెలుగులో జెర్సీ మూవీనే కీర్తి కి మరో టాలీవుడ్ ప్రాజెక్ట్ అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*