కల కోసమే కానీ… డబ్బు కోసం కాదంటున్న హీరోయిన్..!

అజ్ఞాతవాసి సినిమా టైం లో బరువు పెరగడం, ఆ సినిమా డిజాస్టర్ అవడంతో హీరోయిన్ కీర్తి సురేష్ పనైపోయిందని అనుకున్న తరుణంలో ఆమె నటించిన మహానటి సినిమా విడుదల కావడం.. ఆ సినిమా లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టే పర్ ఫార్మెన్స్ తో మళ్లీ ఒక్కసారిగా హిట్ హిరోయిన్ అవడమే కాదు… అందరికి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. ఆ సినిమాలో కీర్తి నటనకి టాలీవుడ్, కోలీవుడ్ దర్శక నిర్మాతలంతా ఫ్లాట్ అయ్యారు. దెబ్బకి కీర్తి సురేష్ కి అవకాశాల వెల్లువ వరదలాగా మారింది. ప్రస్తుతం కోలీవుడ్ లో వరసగా సినిమాలకు సైన్ చేస్తున్న ఈ భామ టాలీవుడ్ లో మాత్రం సినిమాలు ఒప్పుకోకుండా కాస్త బెట్టు చేస్తుంది.

డబ్బుల కోసం సినిమాల్లోకి రాలేదు

అయితే కీర్తి సురేష్ మహానటి సినిమా హిట్ తో బాగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని… ఇక తన వద్దకు వచ్చిన దర్శకనిర్మతలకు తన పారితోషకం చెప్పి హడలు కొడుతుందని.. అందుకే కీర్తి సురేష్ టాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే టాక్ నడుస్తుంది. అలాగే కోలీవుడ్ సినిమాలను ఒప్పుకుంటూ టాలీవుడ్ సినిమాలను చిన్న చూపు చూస్తుందని మాట కూడా గట్టిగానే వినబడుతుంది. మరి ఇంతగా న్యూస్ లు సోషల్ మీడియాని చుట్టూ ముడితే… ఆ విషయం కీర్తి సురేష్ వద్దకు వెళ్లకుండా వుంటుందా. మరి ఇప్పుడు ఈ వార్తలు విన్న కీర్తి సురేష్ ఫైర్ అవుతుంది. తనకి సినిమాలంటే ఇష్టం గనుకనే హీరోయిన్ అయ్యానని.. అలాగే తనకి డబ్బు ముఖ్యం కాదని… తన కలల కోసమే తానూ సినిమాల్లోకి వచ్చానని. మరి కలలు తీరకుండా ఇలా రెమ్యునరేషన్ పెంచేసి డబ్బు సంపాదించేయ్యడం అనేది తనకు అవసరం లేదని ఘాటైన సమాధానమే ఇచ్చింది. అయితే తాను తెలుగు సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం మాత్రం.. ప్రస్తుతం తమిళంలో సినిమాలు ఒప్పుకోవడం.. ఆ సినిమా షూటింగ్స్ తో తనకి టాలీవుడ్ సినిమాలు చేసేందుకు డేట్స్ లేకపావడమే కారణమని చెబుతుంది ఈ భామ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*