కీర్తి పరిస్థితి ఏంటి…..?

మహానటితో కీర్తి గడించిన కీర్తి సురేష్ కి ప్రస్తుతం అస్సలు కలిసిరావడం లేదు. బరువు పెరగడంతో.. కీర్తి సురేష్ క్రేజ్ డౌన్ అవుతుంది. ఇప్పటికే తమిళనాట విక్రమ్ తో నటించిన సామి స్క్వేర్ డిజాస్టర్ అవడంతో కీర్తి సురేష్ ఆశలన్నీ విశాల్ తో నటించిన పందెం కోడి 2 మీదే ఉన్నాయి. నిన్న గురువారం ప్రపంచవ్యాప్తంగా పందెం కోడి 2 ప్రేక్షకులముందుకు వచ్చింది. అయితే తమిళనాట పందెంకోడి 2 టాక్ సంగతి పక్కన పెట్టి తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులనుండి, క్రిటిక్స్ నుండి విశాల్ పాస్ మార్కులైతే వేయించుకున్నాడు కానీ… హిట్ టాక్ తెచ్చుకోలేక పోయాడు. అయితే ఈ సినిమా తో అయినా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలనుకున్న కీర్తి సురేష్ కి ఈ సినిమా ఎంతవరకు మేలు చేసిందో చూద్దాం.

మీరా జాస్మిస్ పాత్రకు కొనసాగింపులా…..

ఈ సినిమాలో కీర్తి సురేష్.. పందెం కోడిలో హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్ పాత్రకు కొనసాగింపులా అనిపించే క్యారెక్టర్లో నటించింది. తన కొడుకు ప్రేమించిన అమ్మాయి ఎవరా అని హీరో తండ్రి చూస్తుండగా.. హీరోయిన్ స్కూటర్ నడుపుతూ దాన్ని గాల్లోకి లేపి సెల్ఫీ దిగుతుంది. ఇంకోచోట హీరోతో కలిసి జీపులో వెళ్తూ వెళ్తూ తను దిగాల్సిన చోట మర్రి ఊడల్ని పట్టుకుని ఎగిరి కిందికి దూకుతుంది. హీరోయిన్ని ఇలాంటి అల్లరి పాత్రలో చూడటం కూడా కొత్తగా అనిపిస్తుంది. అల్లరి అమ్మాయి అయిన చారుమతి పాత్రలో పర్వాలేదనిపించింది. కాకపోతే ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో కీర్తిని చూడ‌డం క‌ష్టమేమో. చాలా మాసీగా క‌నిపించింది. మ‌హాన‌టిలో చూసిన కీర్తినేనా మనం చూస్తున్నది అన్నట్టుంది. ఈసారీ త‌న పాత్రకు తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం సంతోషించ‌ద‌గిన విషయం.

సో…సో..టాక్ మాత్రమే……

కాకపోతే పందెం కోడి 2 సూపర్ హిట్ అయితే కీర్తి సురేష్ పాత్రకి కొద్దిగా పేరొచ్చేది. కానీ సినిమాకి మిక్స్డ్ టాక్ పడడంతో కీర్తి సురేష్ కి కూడా సో సో టాకే వస్తుంది. మరి సామి స్క్వేర్ ప్లాప్ తో ఉన్న కీర్తికి పందెం కోడితో కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాల పరిస్థితి ఇలా ఉంటె… విజయ్ తో కలిసి మురుగదాస్ డైరెక్షన్ లో నటించిన సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*