గ్లామర్ రోల్స్ కి సై

Keerti Suresh upcoming movies

”నేను శైలజ” సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయిన కీర్తి సురేష్..ఆ తరువాత నాని తో ‘నేను లోకల్’ సినిమాతో అందరికి హృదయాలు గెలుచుకుని..”మహానటి” సినిమాతో ఫ్యామిలి ప్రేక్షకులతో పాటు సినీ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటా అంటూ మొదటి నుండి చెబుతున్న కీర్తి.. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో గ్లామర్ పాత్రలు చేయడానికి సై అంటుంది.

లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో మీరు గ్లామర్ పాత్రలో నటిస్తారా? అన్న ప్రశ్నకు ఆమె ఇలా సమాధానం ఇచ్చింది.. “గ్లామర్ రోల్స్ కు సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఆ రోల్స్ చేసేవారికి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. నా అభిమతానికి భిన్నంగా ఎపుడు చేయను” అని చెప్పుకొచ్చింది.

మలయాళంలో 2013 లో “గీతాంజలి” లో చేసిన పాత్రలు లాంటివి చేయడానికి ఎప్పుడూ సిద్దమే అని చెప్పింది. అవసరం అయితే డీ – గ్లామర్స్ రోల్స్ చేయడానికి కూడా సిద్దమే అని చెప్పింది. మొన్నటివరకు చాలా పద్ధతిగా..ట్రెడిషనల్ గా నటించిన కీర్తి సురేష్ అందాల ఆరబోతకు కూడా సిద్దమే అంటుంది. మరీ ఈమెను పెట్టి ఏ డైరెక్టర్ అటువంటి పాత్రలు చేయిస్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*