కీర్తి కి మరో అరుదైన అవకాశం.. మరి ఒప్పుకుంటుందా?

ప్రస్తుతం కీర్తి సురేష్ మహానటి సినిమాతో సోషల్ మీడియాలో తెగ ట్రేండింగ్ లో ఉంది. మహానటి సినిమా లో సావిత్రి పాత్రను చేస్తున్న కీర్తి సురేష్ అచ్చం సావిత్రి పోలికలతో ఉండడమే ఆమెకి అదృష్టం కలిసి వచ్చింది. ప్రస్తుతం మహానటి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ పైనే అందరి కళ్ళు ఉంన్నాయి. రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహానటి మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇలాంటి క్రేజీ బయో పిక్ లో ఒదిగిపోయి నటించిన కీర్తి సురేష్ కి మరో క్రేజీ బయో పిక్ అవకాశం తగిలేలా కనబడుతుంది.

మరి ఆ బయో పిక్ లో గనక కీర్తి సురేష్ నటించింది అంటే… ఇక కీర్తి కి ఎదురే ఉండదు. ఇంతకీ ఆ బయో పిక్ ఎవరి మీద అనుకుంటున్నారా? సినిమా రంగంలోనూ, తమిళనాట రాజకీయాల్లోనూ చక్రం తిప్పి చివరికి అనారోగ్యం పాలై హాస్పిటల్ లోనే కన్ను మూసిన జయలలిత బయో పిక్ లో కీర్తి సురేష్ నటిస్తుందని న్యూస్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న హాట్ న్యూస్. మరి కీర్తి సురేష్ మహానటి ప్రమోషన్స్ లో భాగంగా ఈ బయో పిక్ పై చిన్నపాటి క్లూ కూడా ఇచ్చింది. అదేమిటంటే.. త్వరలోనే తాను తమిళంలో ఒక బయో పిక్ చేయబోతున్నట్లుగా చెప్పింది.

ఇకపోతే కీర్తి సురేష్ తో ఈ జయలలిత బయో పిక్ ని తెరకెక్కించబోయే నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్టుగా టాక్. మరి కీర్తి ఒప్పుకోవడమే తరువాయి అంటున్నారు. మరి మహానటిగా కీర్తి సురేష్ ఇప్పటికే అందరి మనసులను కొల్లగొడుతుంది. నిజంగా మళ్ళీ జయలలిత బయో పిక్ లో గనక కీర్తి సురేష్ నటిస్తే ఇక ఆమెకి తిరుగుండదు. మరి జయలలితగా కీర్తి సురేష్ ఎలా ఉంటుందో అంటూ అప్పుడే చాలామంది ఊహాగానాలు చేసేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*