కన్నడలోనే కాదు.. బాలీవుడ్ లోనూ అదరగొడతాడట..!

కన్నడలో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న కిచ్చ సుదీప్ సొంత భాషలోనే కాదు తెలుగు, తమిళంలోనూ మంచి పేరున్న నటుడు. తెలుగులో రాజమౌళి ఈగ సినిమాలో ఇచ్చిన విలన్ పాత్రని స్టైలిష్ గా అదరగొట్టాడు. ఆ సినిమాలో సుదీప్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇక సుదీప్ కి తెలుగులో వరసగా విలన్ పాత్రలే వస్తాయని.. ఇక టాలీవుడ్ కి మంచి విలన్ దొరికాడనున్నారు. కానీ సుదీప్ ఈగ తర్వాత మళ్లీ పెద్దగా తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించలేదు. తాజాగా మెగాస్టార్ చిరు 151 మూవీ సై రా నరసింహ రెడ్డి సినిమాలో సుదీప్ ఒక కీ రోల్ లో నటిస్తున్నాడు. మరి అడపాదడపా తెలుగు, తమిళంలో నటిస్తున్న సుదీప్ కన్నడ లో మాత్రం పెద్ద స్టార్.

ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలోనే…

అయితే సుదీప్ తాజాగా బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో మూవీ లో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడనే టాక్ వినబడుతుంది. అది కూడా సల్మాన్ ఖాన్ చిత్రంలో సుదీప్ కి విలన్ రోల్ వచ్చినట్లుగా దానికి సుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పెద్ద స్టార్ హీరో. ఆయన సినిమాలు వరసగా ఫ్లాప్ అయినప్పటికీ… సల్మాన్ కొత్త సినిమా వస్తుంది అంటే.. ఆ క్రేజే వేరు. అలాంటి స్టార్ హీరో సినిమాలో సుదీప్ విలన్ రోల్ అంటే ఇక సుదీప్ కి ఇండియా వైడ్ గా పేరొచ్చేస్తుంది. ఇంతకీ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ భరత్ సినిమాలో చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా సల్మాన్ నటిస్తున్న భరత్ సినిమా పూర్తవగానే… సల్మాన్ దబాంగ్ 3 సినిమా చెయ్యబోతున్నాడు.

దబాంగ్ కి విలన్ గా సుదీప్

సల్మాన్ కెరీర్ లో దబాంగ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవగా… దబాంగ్ 2 ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు అదే సీరీస్ లో దబాంగ్ 3 లో సల్మాన్ నటించబోతున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఈ సినిమా చేయబోతున్నాడని.. ఇక విలన్ రోల్ కి కిచ్చ సుదీప్ ని ఎంపిక చేసినట్టుగా బి టౌన్ టాక్. మరి ఈ సినిమా ఒకవేళ హిట్ అయ్యిందా ఇక సుదీప్ పేరు మాత్రం మార్మోగిపోవడం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*