అక్క‌డ ఓహో అన్నారు… మ‌రి ఇక్క‌డ‌..?

Nayanathara in Anjali Vikramadhitya

కోలీవుడ్ లో నయనతార లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో దుమ్ము రేపుతోంది. ఒకపక్క స్టార్ హీరోలతో నటిస్తూనే కుర్ర హీరోలతో చెలరేగిపోతూ సత్తా చాటుతుంది. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్న నయనతార తాజాగా… కోలీవుడ్ లో కొలమావు కోకిల తో అదరగొట్టే హిట్ కొట్టింది. సినిమా ఓ అన్నంత టాక్ రాకపోయినా నయనతారకు ఉన్న క్రేజ్ తోనే సినిమాకు అదరగొట్టే కలెక్షన్స్ వచ్చాయి. తమిళనాట స్టార్ హీరో కలెక్షన్స్ తో నయనతార పోటీ పడిందంటేనే ఆ సినిమా అక్కడ ఏ రేంజ్ హిట్ అయ్యిందో అర్ధమవుతుంది. అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కో ర్ బావుండడం, తమిళ నేటివిటీ అన్ని ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయి.

తెలుగులో మాత్రం ఆక‌ట్టుకోలేక…

ఇక ఇదే సినిమాని తెలుగులో కో కో కోకిల టైటిల్ పేరుతో శుక్రవారమే విడుదల చేశారు. తనకున్న స‌మ‌స్య‌ల వలన డ్రగ్స్ సప్లైయిర్ గా ఈ సినిమాలో నటించిన నయనతార తమిళ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసినట్టుగా.. తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చెయ్యలేకపోయినట్లే కనబడుతుంది. అయితే తెలుగులో తమిళ వాసన ఎక్కువవడం, అలాగే నయనతార డీగ్లామర్ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అందుకే తమిళంలో బాగా హిట్ అయిన నయనతార కో కో కోకిల సినిమా తెలుగులో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. తమిళం లో ఓహో అన్నవాళ్లు.. తెలుగులో జస్ట్ యావరేజ్ అంటున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*