కొరటాల చేసిన సాహసం విన్నారా?

మహేష్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’ ఈనెల 20న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగింది. ఒక్క నైజాం ఏరియా రైట్స్ 22 కోట్లకు అమ్ముడైందంట. శ్రీమంతుడు తర్వాత అదే కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో నైజాం హక్కులు ఆ రేంజ్ లో అమ్ముడైందని తెలుస్తుంది.

హాఫ్ కొరటాలదే…..

అయితే తాజా సమాచారం ప్రకారం నైజాం ఏరియాలో సగభాగం డిస్ట్రిబ్యూషన్ కొరటాల తీసుకున్నారని ఫిలింనగర్ టాక్. మొదటి నుండి మహేష్ సినిమాలకు నైజాంలో మంచి క్రేజ్ పాటు మంచి మార్కెట్ కూడా ఉంది. మహేష్ సినిమాలు అక్కడ మినిమం వసూల్ రాబడుతుంది అని కొరటాల శివ కొంతభాగం డిస్ట్రిబ్యూషన్ ను తీసుకున్నారని అంటున్నారు. మరో పక్క సినిమా మీద కాన్ఫిడెన్స్ తో కొరటాల మొదటిసారి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని వినికిడి. సినిమా టాక్ బాగుంటే వసూళ్లు ఒక రేంజ్ లో ఉంటాయి అని నమ్ముతున్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ తో పాటు కొరటాల కూడా బలంగా నమ్ముతున్నాడు కాబట్టే అయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.