చెర్రీతో తీయాల‌నుకుని…. చిరు కోసం మారుస్తున్నాడా..?

రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేయాల‌నుకొన్నా ఎంత‌కీ క‌లిసి రావ‌డం లేదు కొర‌టాల శివ‌కి. ఏదో ఒక ర‌కంగా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. ఒక‌సారి సినిమా కొబ్బ‌రికాయ కొట్టినా…. ఆ త‌ర్వాత ఆగిపోయింది. భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత క‌చ్చితంగా ఈ కాంబినేష‌న్ కుద‌రొచ్చ‌నుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. కానీ అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ఈసారి కొర‌టాల శివ ఖాళీ అయినా… రామ్‌చ‌ర‌ణ్ బిజీ అయిపోయారు. ఆయ‌న బోయ‌పాటితో చేస్తున్న సినిమా త‌ర్వాత, రాజ‌మౌళికి హ్యాండోవ‌ర్ అవ్వ‌నున్నారు. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొన్నాక‌… కొర‌టాల మ‌రో హీరోని ఎంచుకోక త‌ప్ప‌లేదు. తాజా స‌మాచారం మేర‌కు ఆయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని చిరంజీవితో తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. రామ్‌చ‌ర‌ణ్ – కొర‌టాల కాంబినేష‌న్‌లో సినిమాని ప్ర‌క‌టించిన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థే చిరంజీవితో సినిమాని తీయ‌బోతోంద‌ట‌. అందుకోసం కొర‌టాల క‌థ‌ని సిద్ధం చేసే ప‌నిలో ఉన్నార‌ట‌.

కథకు మెరుగులు దిద్దుతున్న కొరటాల

అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు కొర‌టాల ఇదివ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్‌తో చేయాల‌నుకున్న క‌థ‌నే చిరు కోసం మారుస్తున్నార‌ట‌. కొర‌టాల చేసే సినిమాలు సోష‌ల్ కంటెంట్‌తో కూడుకొనే ఉంటాయి. చెర్రీకి కూడా అలాంటి క‌థే చెప్పాడ‌ట‌. అది న‌చ్చే సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారు. అయితే త‌న‌కి చెప్పిన లైన్ డాడీకి కూడా బాగుంటుంద‌ని చెర్రీ చెప్ప‌డంతో దానికే మార్పులు చేర్పులు చేస్తున్నార‌ట కొర‌టాల శివ‌. ఒక‌ ప‌క్క క‌థ‌కు మెరుగులు దిద్దుతూనే మ‌రోప‌క్క క్యాస్టింగ్ ఎంపికపై దృష్టిపెట్టార‌ని… ముఖ్యంగా క‌థానాయిక కోసం పెద్ద‌యెత్తున క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. సైరా చాలా వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌డంతో కొత్త సినిమాని తొంద‌రంగానే ప‌ట్టాలెక్కించాల‌ని చిరు చెబుతున్నాడ‌ట‌. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌తో పాటు, రామ్‌చ‌ర‌ణ్ కూడా ఆ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోబోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*