స్నేహితుడి కోసం వారు కలవబోతున్నారా..?

కొరటాల శివ చేసిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాలే. మొదటి రెండు సినిమాలు కంటెంట్ పరంగా అదరగొట్టే హిట్స్ కొడితే.. తర్వాతి రెండు సినిమాలు క్రేజ్ తోనే సగం హిట్స్ కొట్టేశాయి. ప్రభాస్ – కొరటాల కాంబోలో వచ్చిన మిర్చి సూపర్ హిట్. మహేష్ – కొరటాల కాంబోలో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్. ఇక ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ కి క్రిటిక్స్ పాజిటివ్ మార్క్స్ ఇవ్వకపోయినా.. ప్రేక్షకులు ఆ సినిమాకి సూపర్ హిట్ కలెక్షన్స్ అందించారు. ఇక మహేష్ – కొరటాల రిపీట్ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను సూపర్ హిట్ అయ్యింది కానీ.. భారీ లాభాలు రాలేదు. అయినా మహేష్ – కొరటాలకున్న క్రేజ్ తోనే సినిమా హిట్ అయ్యింది.

ఇప్పటికే చిరంజీవితో…

ఇక కొరటాల శివ తన ఐదో సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరోగా చెయ్యబోతున్నాడు.. అనేది ప్రచారంలో ఉంది.. కానీ అధికారిక ప్రకటన అయితే లేదు. ప్రస్తుతం చిరు సై రా సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే కొరటాల తో మూవీ చేస్తాడు. ఇక ఈ సినిమా ఫుల్లీ యాక్షన్ తో ఉండబోతుందని.. అలాగే చిరంజీవి ఈ సినిమా లో రెండు పాత్రలు చేయబోతున్నాడనే టాక్ ఉంది. ఇకపోతే జనత గ్యారేజ్ నుండి ఫ్రెండిషిప్ ని బాగా మెయింటైన్ చేస్తున్న ఎన్టీఆర్, కొరటాల కాంబో రిపీట్ కాబోతుందనే న్యూస్ హైలెట్ అయ్యింది. కొరటాల చిరుతో సినిమా చేసాక తన తదుపరి ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చెయ్యబోతున్నాడంటూ.. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది కూడా తన మిత్రుడు నిర్మాతగా కొరటాల ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

స్నేహితుడితో సినిమా ఖాయం…

కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని కొరటాల కష్టాలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు కాబట్టి.. ఆయనకి ఒక సినిమా చేసిపెడతానని మాటిచ్చాడట కొరటాల. అయితే కొరటాల చిరుతో కమిట్ అవడంతో సుధాకర్ మిక్కిలినేని కాస్త భయపడ్డాడట. కానీ కొరటాల మాత్రం సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో సినిమా కచ్చితంగా వుంటుందనే కాదు… ఇప్పటికే సుధాకర్ మిక్కిలినేని సినిమాకి సైన్ కూడా చేసాడు. ఇక ఆ సినిమాని కూడా ఎన్టీఆర్ తో చేయబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న అరవింద సమేత పూర్తి కాగానే… రాజమౌళి మల్టీస్టారర్ ని కూడా పూర్తి చేసి కొరటాల తో సినిమా చేస్తాడట. మరి ఎలాగూ ఎన్టీఆర్, కొరటాల ఎలా లేదన్నా వచ్చే ఏడాదో చివరి నాటికి వారి ప్రాజెక్టులతో ఫ్రీ అవుతారు. ఇక 2019 చివర్లో సుధాకర్ మిక్కిలినేని నిర్మాణంలో ఎన్టీఆర్ – కొరటాల సెట్స్ మీదకెళ్ళి 2020 చివరికి తమ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*