క్రిష్ ముందున్నాడు.. బోయపాటి వెనకబడ్డాడు..!

వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి ‘ఎన్టీఆర్’ బయోపిక్. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆ పాత్రకు సంబంధించి లుక్స్ బయటికి వచ్చాయి. రిలీజ్ చేసిన పోస్టర్స్ లో బాలయ్య గెటప్స్ చూస్తుంటే ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అదే సంక్రాంతికి రామ్ చరణ్ – బోయపాటిల సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అయితే ఆ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయకపోవటమే కాదు ఇంతవరకు టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు మేకర్స్. మరి దీనికి ప్రొమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్నది ఇంకా తెలియడం లేదు. సినిమా నిర్మాణ దశలో ఉండగానే ఆ సినిమాకు హైప్‌ ఏ విధంగా పెంచాలనేది క్రిష్‌ మరోసారి చూపెడుతున్నాడు.

షూటింగ్ దశలోనే ప్రమోషన్స్…

అంతకముందు క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విషయంలో కూడా అదే జరిగింది. ఆ సినిమాపై అంతలా బజ్ రావడానికి కారణం దాని ప్రొమోషన్స్. అందుకే ఇప్పుడు ‘ఎన్టీఆర్’ సినిమాకి కూడా షూటింగ్ దశలో ఉండగానే ప్రొమోషన్స్ స్టార్ట్ చేసి సినిమాపై అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. ప్రొమోషన్స్ అనేవి మొదటివారం కలెక్షన్స్ పై పడుతుంది. సినిమా బాగున్నా లేకున్నా ప్రొమోషన్స్ తో ఒక వారం పాటు లాక్కొచ్చే రోజులివి. అందుకే ‘ఎన్టీఆర్’ సినిమాని ఇప్పటి నుండే అంతలా ప్రమోట్ చేయడానికి కారణం. దానికి తోడు ఎన్టీఆర్ కథ తెలుసుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంది. మరి క్రిష్ ఈ సినిమాను ఎలా తీస్తున్నాడో తెలియాలంటే జనవరి వరకు ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*