క్రిష్ తీసిన మణికర్ణిక ను రీషూట్ చేస్తున్న కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ కి క్రిష్ కి పడకపోవడం వల్లే ఆయన ‘మణికర్ణిక’ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని సమాచారం. ఇది అతను డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇంకా ఆ సినిమా కొంత భాగం షూటింగ్ ఉండగానే క్రిష్ ‘ఎన్టీఆర్’ ప్రాజెక్ట్ కు వెళ్లిపోయాడంటే అర్ధం చేసుకోవచ్చు. ‘మణికర్ణిక’ షూటింగ్ స్టార్ట్ అయినా దగ్గర నుండే వారిద్దరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని..అందుకే క్రిష్ 80 శాతం షూటింగ్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ నుండి వాక్ అవుట్ అయ్యాడని టాక్ ఉంది.

ఆ తర్వాత కంగనా ఆ ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేసి తనే మిలిగిన 20 శాతం డైరెక్ట్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసిందని ఆమధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇంతవరకు బాగానే ఉంది కానీ…ఇప్పుడు ఆమె ఇగోకి పోయి క్రిష్ తీసిన సన్నివేశాలని తొలగించేస్తోందట. ఇందులో మల్లయుద్ధం సన్నివేశాలని సోనూ సూద్‌పై క్రిష్‌ తీస్తే ఆ ఎపిసోడ్ మొత్తం కంగనా తొలగించడం వల్లే సోనూ సూద్‌ కూడా అలిగి వెళ్లిపోయాడని టాక్ ఉంది.

క్రిష్ తీసిన మేజర్ సన్నివేశాల్లని కంగనా కట్ చేసి రీషూట్‌ చేస్తుందట. దాంతో ప్రొడ్యూసర్స్ కి నష్టం అయినా కానీ కంగనకి ఎదురు చెప్పలేక వారు కిక్కురుమనడం లేదట. సో దీని ప్రకారం చూసుకుంటే సినిమా రిలీజ్ అయ్యాక టైటిల్స్ లో క్రిష్ పేరుకి బదులు కంగనా పేరు ఉంటుందేమో అంటున్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*