‘మణికర్ణిక’ విషయంలో క్రిష్ ఆలా చేయడం కరెక్టేనా?

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయాలనుకుని…దాని కి తగ్గట్టే క్రిష్ ఆ సినిమా షూటింగ్ ను చాలా ప్లాన్డ్ గా శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. మరోపక్క క్రిష్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో ‘మణికర్ణిక’ అనే సినిమాను రూపొందించాడు. ఇది కూడా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

టైటిల్ రోల్ లో కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీభాయిగా నటిస్తున్న ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ప్యాచ్ వర్క్స్ ఉండటంతో ఆ సినిమా ఇంకా పూర్తిగా అవ్వలేదు. దానికి తోడు డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం గైర్హాజరులో ‘ఎన్టీఆర్’ షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీ అయ్యిపోయాడు. అందుచేత క్రిష్..‘మణికర్ణిక’ చిత్రానికి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు.

అందుకే ఆ ప్యాచ్ వర్క్ పనులు రైటర్ విజయేంద్ర ప్రసాద్, ప్రసూన్ జోషి సహకారంతో కంగనా రనౌత్ చిత్రాన్ని పూర్తిచేసే బాధ్యతను చేపట్టారు. వారిద్దరిని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎలా చేయాలి ఏం చేయాలి అని క్రిష్ మాట్లాడుతున్నాడట. తమతో ఆయ‌న ట‌చ్‌లోనే ఉన్నారని ‘మణికర్ణిక’ టీమ్ చెబుతోంది. ఖాళీ ఉన్నప్పుడల్లా క్రిష్ బొంబాయికి వెళ్లి ఆ పనులు చూసుకుంటున్నారని సమాచారం. మరి ఇంత బిజీ బిజీగా చేస్తే ‘మణికర్ణిక’ అవుట్ ఫుట్ ఎలా వస్తుంది? అన్న సందేహాలు సినీ అభిమానుల్లో వస్తున్నాయి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*