క్రిష్ వైవాహిక జీవితంలో నిప్పులు పోసిన హీరోయిన్..?

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా పేరుంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ మణికర్ణికా సినిమాతో అతి త్వరలోనే ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. అయితే క్రిష్ కి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాని తెరకెక్కిస్తున్నప్పుడు అంటే 2016 ఆగష్టు లో డాక్టర్ రమ్య వెలగ తో వివాహం జరిగింది. క్రిష్ ది ప్రేమ వివాహమే అయినప్పటికీ.. పెద్దల అనుమతితో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇంతకాలం భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్న క్రిష్ ఇప్పుడు విడాకులు ఇస్తున్నట్లుగా ఒక గాసిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

క్రిష్ ఇలా చేయడం ఏంటీ…?

అది కూడా ప్రగ్య జైస్వాల్ వలన అనే న్యూస్ బాగా వైరల్ అవుతోంది. క్రిష్… వరుణ్ తేజ్ – ప్రగ్య జైస్వాల్ తో కంచె సినిమాని తెరకెక్కించాడు.అయితే ప్రగ్య జైస్వాల్ తో క్రిష్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడని… అందుకే తన భార్య రమ్య తో క్రిష్ విడాకులకి అప్లై చేసాడని అంటున్నారు. అయితే క్రిష్ డివోర్స్ విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ క్రిష్ ఇలా చేస్తున్నాడు అంటే చాలామందికి నమ్మ బుద్దికావడం లేదు. అందం, అభినయం ఉన్న భార్య కి ఇలా విడాకులివ్వడం ఏమిటి అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం క్రిష్ మణికర్ణికా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా టాలీవుడ్ లో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ని సెట్స్ మీదకి తెచ్చేపనిలో ఉన్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*